Yesuni Premanu Ne Marakanu
యేసుని ప్రేమను నే మారకను
నెప్పుడు దలచవే యో మనసా
వాసిగ నాతని వరనామంబును
వదలక పొగడవె యో మనసా
1. పాపులకొరకై ప్రాణముబెట్టిన
ప్రభునిల దలచవె యో మనసా
శాపమునంతయు జక్కగ నోర్చిన
శాంతుని పొగడవె యో మనసా
2. కష్టములలో మన కండగ నుండిన
కర్తను దలచవె యో మనసా
నష్టములన్నియు నణచిన యాగురు
శ్రేష్టుని పొగడవె యో మనసా
3. మరణతఱిని మన శరణుగ నుండెడు
మాన్యుని దలచవె యో మనసా
కరుణను మన కన్నీటిని దుడిచిన
కర్తను పొగడవె యో మనసా
4. ప్రార్థనలు విని ఫలముల నొసగిన
ప్రభునిక దలచవె యో మనసా
వర్థన గోరుచు శ్రద్ధతో దిద్దిన
వంద్యుని పొగడవె యో మనసా
5. వంచనలేక వరముల నొసగిన
వరదుని దలచవె యో మనసా
కొంచెము కాని కూర్మితో దేవుని
కొమరుని పొగడవె యో మనసా

Leave a Reply