Yesuni Nammedi Varu
పల్లవి: యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత క పతో
నీతిమంతులయ్యెదరు – యేసుని నమ్మెడివారు
1. ఖర్జూరపు చెట్టువలె – మొవ్వు వేయుచుండెదరు
ఖర్జూరపు మట్టలతో – రక్షణకై స్తుతించెదరు
2. లేబానోను దేవదారు – చెట్టువలె ఎదుగుదురు
ప్రభు క పాజ్ఞానములో – ఎదుగుచు నుందురువారు
3. యెహోవా మందిరములో – నాటబడి యుండెదరు
సహనముతో నిలిచెదరు – కదలక స్థిరులై యుండెదరు
4. దేవుని యావరణములో – వర్ధిల్లుచు నుండెదరు
సేవింతురు తమ ప్రభుని – ఘనపరతురు నిరతంబు
5. వారు ముసలితనంబున – చిగురు పెట్టి ఫలింతురు
ప్రసిద్ధి చేతురు ప్రభుని – యథార్థవంతుడనుచు
6. నీటి కాలువ యోరను – నాటబడిన వారలై
మేటిసారము కలిగి – పచ్చగ నుందురు వారు
7. హల్లేలూయ పాటపాడి – వల్లభుని స్తుతింతురు
చల్లని ప్రభురాకడకై – మెల్లగా వేచియుండెదరు

Leave a Reply