Yesuni Korakai Ila Jeevincheda
[Verse]
యేసుని కొరకై యిల జీవించెద
భాసురముగ నే ననుదినము
దోసములన్నియు బాపెను మోక్ష
ని వాసమున ప్రభు జేర్చునుగా
[Verse]
1. నాశనకరమగు గుంటలోనుండియు
మోసకరంబగు యూబినుండి – 2
నాశచే నిలపై కెత్తెను నన్ను
పి శాచి పథంబున దొలగించెన్
[Verse]
2. పలువిధముల పాపంబును జేసితి
వలదని ద్రోసితి వాక్యమును – 2
కలుషము బాపెను కరుణను బిలిచెను
సిలువలో నన్నాకర్షించెను
[Verse]
3. అలయక సొలయక సాగిపోదును
వెలయగ నా ప్రభు మార్గములన్ – 2
కలిగెను నెమ్మది కలువరిగిరిలో
విలువగు రక్తము చిందించిన ప్రభు
[Verse]
4. శోధన బాధలు శ్రమలిల కల్గిన
ఆదుకొనును నా ప్రభువనిశం – 2
వ్యాధులు లేములు మరణము
వచ్చిన నాధుడే నా నిరీక్షణగున్
[Verse]
5. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు
గుప్తమై యున్నవి ప్రభునందు – 2
అద్భుతముగ ప్రభు వన్నియునొసగి
దిద్దును నా బ్రతుకంటిని
[Verse]
6. అర్పించెను దన ప్రాణమునాకై
రక్షించెను నా ప్రియ ప్రభువు – 2
అర్పింతును నా యావజ్జీవము
రక్షకు డేసుని సేవింప
[Verse]
7. ప్రభునందానందింతును నిరతము
ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే – 2
దీర్చును యిల నా చింతలు
అభయముతో స్తుతియింతు ప్రభున్
[Verse]
8. యౌవన జనమా యిదియే
సమయము యేసుని చాటను – 2
రారండి పావన నామము పరిశుద్ధ నామము
జీవపు మార్గము ప్రచురింపన్

Leave a Reply