Upavasa Prarthanalo Neetho
ఉపవాస ప్రార్థనలో నీతో
సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్థనతో
నిను నేను వెదికెదనయ్యా
నా ఉపవాస ప్రార్థనలో నీతో
సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్థనతో
నిను నేను వెదికెదనయ్యా
నా పాప క్రియలన్నియు
నే విడిచిపెట్టెదనయ్యా
నా దోషములు మన్నించి
నన్ను పరిశుద్ధునిగ మార్చయ్యా
నా అహము పోవాలయ్యా
నాకు దీనత్వము ఇవ్వయ్యా యేసయ్యా
నా స్వయము చావాలయ్యా
నీవు నాలో బ్రతకాలయ్యా
నా ఉపవాస ప్రార్థనలో నీతో
సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్థనతో
నిను నేను వెదికెదనయ్యా…
1. మోషే ఉపవాసముండి ప్రార్థించినపుడు
నీ ధర్మశాస్త్రమును అందించినావు
మోషే ఉపవాసముండి ప్రార్థించినపుడు
నీ ధర్మశాస్త్రమును అందించినావు
నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా
నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా
నా యెడల నీ చిత్తము తెలియజేయుము
తెలియజేయుము
నా ఉపవాస ప్రార్థనలో నీతో
సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్థనతో
నిను నేను వెదికెదనయ్యా…
2. దానియేలు ఉపవాసముండి
ప్రార్థించినపుడు
రాబోయే సంగతులు చూపించినావు
దానియేలు ఉపవాసముండి
ప్రార్థించినపుడు
రాబోయే సంగతులు చూపించినావు
నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా
నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా
నూతన దర్శనము నాకు దయచేయుము
నాకు దయచేయుము
నా ఉపవాస ప్రార్థనలో నీతో
సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్థనతో
నిను నేను వెదికెదనయ్యా…
3. నెహెమ్యా ఉపవాసముండి
ప్రార్థించినపుడు
పడిన ప్రాకారములు నీవు కట్టినావు
నెహెమ్యా ఉపవాసముండి
ప్రార్థించినపుడు
పడిన ప్రాకారములు నీవు కట్టినావు
నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా
నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా
పాడైన నా బ్రతుకును బాగుచేయుము
బాగుచేయుము
నా ఉపవాస ప్రార్థనలో నీతో
సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్థనతో
నిను నేను వెదికెదనయ్యా…
4. నీవు ఉపవాసముండి ప్రార్థించినపుడు
అపవాదినే నీవు ఓడించినావు
నీవు ఉపవాసముండి ప్రార్థించినపుడు
అపవాదినే నీవు ఓడించినావు
నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా
నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా
శోధనపై జయమొందె కృపను నాకీయుము
కృపను నాకీయుము
నా ఉపవాస ప్రార్థనలో నీతో
సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్థనతో
నిను నేను వెదికెదనయ్యా…
5. ఎస్తేర్ ఉపవాసముండి
ప్రార్థించినపుడు
నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు
ఎస్తేర్ ఉపవాసముండి ప్రార్థించినపుడు
నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు
నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా
నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా
నా దేశ ప్రజలను నీవు రక్షించుము
నీవు రక్షించుము
నా ఉపవాస ప్రార్థనలో నీతో
సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్థనతో
నిను నేను వెదికెదనయ్యా…
6. పౌలు ఉపవాసముండి
ప్రార్థించినపుడు
వేలాది సంఘములు స్థాపించినావు
పౌలు ఉపవాసముండి
ప్రార్థించినపుడు
వేలాది సంఘములు స్థాపించినావు
నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా
నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా
నీ సంఘ స్థాపనకు నన్ను వాడుము
నన్ను వాడుము
నా ఉపవాస ప్రార్థనలో నీతో
సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్థనతో
నిను నేను వెదికెదనయ్యా…
7. యోవేలు ఉపవాసమని
ప్రకటించినపుడు
ఆ దేశ స్థితిగతులను మార్చినావు
యోవేలు ఉపవాసమని
ప్రకటించినపుడు
ఆ దేశ స్థితిగతులను మార్చినావు
మేము ఉపవాసముండి
ప్రార్థించుచుండగా
మేము ఉపవాసముండి
ప్రార్థించుచుండగా
కడవరి ఉజ్జీవము మాపై కుమ్మరించుము
మాపై కుమ్మరించుము
నా ఉపవాస ప్రార్థనలో నీతో
సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్థనతో
నిను నేను వెదికెదనయ్యా
నా ఉపవాస ప్రార్థనలో నీతో
సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్థనతో
నిను నేను వెదికెదనయ్యా
నా పాప క్రియలన్నియు
నే విడిచిపెట్టెదనయ్యా
నా దోషములు మన్నించి
నన్ను పరిశుద్ధునిగ మార్చయ్యా
నా అహము పోవాలయ్యా
నాకు దీనత్వము ఇవ్వయ్యా యేసయ్యా
నా స్వయము చావాలయ్యా
నీవు నాలో బ్రతకాలయ్యా
నా ఉపవాస ప్రార్థనలో నీతో
సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్థనతో
నిను నేను వెదికెదనయ్యా…

Leave a Reply