Uppongene Hudayam
ఉప్పొంగేనే హృదయం ఆనందంతో
పులకించేనే పుడమి సంతోషంతో
ఉప్పొంగేనే హృదయం ఆనందంతో
పులకించేనే పుడమి సంతోషంతో
రాజాదిరాజు జన్మించే ఇలలో
లోక పాపాన్ని తొలగించుటకు
రాజాదిరాజు జన్మించే ఇలలో
లోక పాపాన్ని తొలగించుటకు
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధాన అధిపతి మన యేసయ్యా
శరీరధారియై ఈ భువిలో జన్మించే
ఆహా ఆశ్చర్యం అద్భుతం రక్షకుని జననం
ఉప్పొంగేనే హృదయం ఆనందంతో
పులకించేనే పుడమి సంతోషంతో
ఉప్పొంగేనే హృదయం ఆనందంతో
పులకించేనే పుడమి సంతోషంతో…
1. చీకటిని తొలగించి మన బ్రతుకులో వెలుగును నింపే
నీతి సూర్యుడై ఉదయించెను
బంధకములలోనుండి మనలను
విడిపించుటకు దేవుడే దీనుడై పుట్టెను
చీకటిని తొలగించి మన బ్రతుకులో వెలుగును నింపే
నీతి సూర్యుడై ఉదయించెను
బంధకములలోనుండి మనలను
విడిపించుటకు దేవుడే దీనుడై పుట్టెను
సర్వలోకానికే సమాధానమే
ధన్యమైన ఈ భువికెంతో పరవశమే
మహదానందమే ఇక సంతోషమే
లోకరక్షకుడు మనకొరకు జన్మించెను
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధాన అధిపతి మన యేసయ్యా
శరీరధారియై ఈ భువిలో జన్మించే
ఆహా ఆశ్చర్యం అద్భుతం రక్షకుని జననం
ఉప్పొంగేనే హృదయం ఆనందంతో
పులకించేనే పుడమి సంతోషంతో
ఉప్పొంగేనే హృదయం ఆనందంతో
పులకించేనే పుడమి సంతోషంతో…
2. పరలోక సైన్యమే – దూతలతో దిగివచ్చి
సర్వోన్నత దేవుని – ఆరాధించగా
తార దారిచూపగ – గొల్లలు జ్ఞానులు
యేసుని చేరి – పూజించగా
పరలోక సైన్యమే – దూతలతో దిగివచ్చి
సర్వోన్నత దేవుని – ఆరాధించగా
తార దారిచూపగ – గొల్లలు జ్ఞానులు
యేసుని చేరి – పూజించగా
సర్వలోకానికే ఈ శుభవార్తను
మనమంతా కలిసి ఇల ప్రకటింపగా
రక్షణానందమే ఇక సంబరమే
మన హృదయాలలో క్రీస్తు జన్మించగా
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధాన అధిపతి మన యేసయ్యా
శరీరధారియై ఈ భువిలో జన్మించే
ఆహా ఆశ్చర్యం అద్భుతం రక్షకుని జననం
ఉప్పొంగేనే హృదయం ఆనందంతో
పులకించేనే పుడమి సంతోషంతో
ఉప్పొంగేనే హృదయం ఆనందంతో
పులకించేనే పుడమి సంతోషంతో
రాజాదిరాజు జన్మించే ఇలలో
లోక పాపాన్ని తొలగించుటకు
రాజాదిరాజు జన్మించే ఇలలో
లోక పాపాన్ని తొలగించుటకు
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధాన అధిపతి మన యేసయ్యా
శరీరధారియై ఈ భువిలో జన్మించే
ఆహా ఆశ్చర్యం అద్భుతం రక్షకుని జననం
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధాన అధిపతి మన యేసయ్యా
శరీరధారియై ఈ భువిలో జన్మించే
ఆహా ఆశ్చర్యం అద్భుతం రక్షకుని జననం
Leave a Reply