Neekishtamainadi Kavali
[Verse]
నీకిష్టమైనది కావాలి దేవునికి
బలిఅర్పణ కోరలేదు దేవుడు
ప్రభు మనసు తెలుసుకో
వాక్యాన్ని చదువుకో
[Verse]
1. కయ్యీను అర్పణ – తెచ్చాడు దేవునికి
హేబేలు అర్పణ – నచ్చింది దేవునికి
[Verse]
అర్పించు వాటికంటే
అర్పించు మనిషి ముఖ్యం
అర్పించు వాటికంటే
అర్పించు మనసు ముఖ్యం
[Verse]
నచ్చాలి మొదటనీవే – కావాలి మొదట నీవే
నీకిష్టమైనది కావాలి దేవునికి…
[Verse]
2. దేహాన్ని దేవునికి – ఇవ్వాలి కానుకగా
క్రీస్తేసువలె దేహం – కావాలి యాగముగా
[Verse]
నీ ధనము ధాన్యము కంటే
ఒకపాపి మార్పు ముఖ్యం
ప్రకటించు క్రీస్తు కొరకే
మరణించు పాపి కొరకే
[Verse]
నీకిష్టమైనది కావాలి దేవునికి
బలిఅర్పణ కోరలేదు దేవుడు
ప్రభు మనసు తెలుసుకో
వాక్యాన్ని చదువుకో…

Leave a Reply