Neekishtamainadi Kavali Devuniki
నీకిష్టమైనది కావాలి దేవునికి
బలిఅర్పణ కోరలేదు దేవుడు
ప్రభు మనసు తెలుసుకో
వాక్యాన్ని చదువుకో
1. కయ్యీను అర్పణ
తెచ్చాడు దేవునికి
హేబేలు అర్పణ
నచ్చింది దేవునికి
అర్పించు వాటికంటే
అర్పించు మనిషి ముఖ్యం
అర్పించు వాటికంటే
అర్పించు మనసు ముఖ్యం
నచ్చాలి మొదటనీవే
కావాలి మొదట నీవే
నీకిష్టమైనది కావాలి దేవునికి
2. దేహాన్ని దేవునికి
ఇవ్వాలి కానుకగా
క్రీస్తేసువలె దేహం
కావాలి యాగముగా
నీ ధనము ధాన్యము కంటే
ఒకపాపి మార్పు ముఖ్యం
ప్రకటించు క్రీస్తు కొరకే
మరణించు పాపి కొరకే
నీకిష్టమైనది కావాలి దేవునికి
బలిఅర్పణ కోరలేదు దేవుడు
ప్రభు మనసు తెలుసుకో
వాక్యాన్ని చదువుకో

Leave a Reply