సిలువే నా శరణాయెను రా నీ
సిలువే నా శరణాయెను రా
సిలువయందే ముక్తి బలము
జూచితి రా
1. సిలువను వ్రాలి యేసు
పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
సిలువే నా శరణాయెను రా నీ
సిలువే నా శరణాయెను రా
సిలువయందే ముక్తి బలము
జూచితి రా
2. సిలువను జూచుకొలది
శిలసమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
సిలువే నా శరణాయెను రా నీ
సిలువే నా శరణాయెను రా
సిలువయందే ముక్తి బలము
జూచితి రా
3. సిలువను దరచి తరచితి
విలువకందగ రాని నీ కృప
కలుషమెల్లను బాపగ జాలును రా
సిలువే నా శరణాయెను రా నీ
సిలువే నా శరణాయెను రా
సిలువయందే ముక్తి బలము
జూచితి రా
4. పలు విధ పథములరసి
ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
సిలువే నా శరణాయెను రా నీ
సిలువే నా శరణాయెను రా
సిలువయందే ముక్తి బలము
జూచితి రా
5. శరణు యేసు శరణు శరణు
శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
సిలువే నా శరణాయెను రా నీ
సిలువే నా శరణాయెను రా
సిలువయందే ముక్తి బలము
జూచితి రా

Leave a Reply