సిలువను మోసి ఈ లోకమును
తలక్రిందులు చేయు తరుణమిదే
సిలువను మోసి ఈ లోకమును
తలక్రిందులు చేయు తరుణమిదే…
1. లేలెమ్ము సోదరుడా నిద్రనుండి
ప్రకటించను యేసు నామమును
లేలెమ్ము సోదరుడా నిద్రనుండి
ప్రకటించను యేసు నామమును
సోమరి యేల నిద్రించెదవు
ఈ ధరను లేపెడు సమయమిదే
సోమరి యేల నిద్రించెదవు
ఈ ధరను లేపెడు సమయమిదే
సిలువను మోసి ఈ లోకమును
తలక్రిందులు చేయు తరుణమిదే…
2. పరిశుద్ధాత్మ కవచము తొడిగి
నీ నడుము కట్టి తయ్యారగుమా
పరిశుద్ధాత్మ కవచము తొడిగి
నీ నడుము కట్టి తయ్యారగుమా
సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి
సువార్తను చాటెడు సమయమిదే
సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి
సువార్తను చాటెడు సమయమిదే
సిలువను మోసి ఈ లోకమును
తలక్రిందులు చేయు తరుణమిదే…
3. లోక రక్షణకై ప్రభు యేసు
వీకతో నరుదెంచెను ఈ ధరకు
లోక రక్షణకై ప్రభు యేసు
వీకతో నరుదెంచెను ఈ ధరకు
వెలుగును మనకు నిచ్చెను యేసు
తన స్తుతులను పాడెడు సమయమిదె
వెలుగును మనకు నిచ్చెను యేసు
తన స్తుతులను పాడెడు సమయమిదె
సిలువను మోసి ఈ లోకమును
తలక్రిందులు చేయు తరుణమిదే…
4. పాతాళమునకు కొనిపోయెడి నీ
పాత నిద్రను విడనాడుమిక
పాతాళమునకు కొనిపోయెడి నీ
పాత నిద్రను విడనాడుమిక
సిలువ మర్మము నెరుగు మిపుడే
కునికెడు సమయము కాదిది ప్రియుడా
సిలువ మర్మము నెరుగు మిపుడే
కునికెడు సమయము కాదిది ప్రియుడా
సిలువను మోసి ఈ లోకమును
తలక్రిందులు చేయు తరుణమిదే…
5. రక్షింపబడుటకాశించినచో
పశ్చాత్తాపపడు మీ దినమే
రక్షింపబడుటకాశించినచో
పశ్చాత్తాపపడు మీ దినమే
కలుషాత్ముండా తడవేల నికన్
కనుమా నీ తీర్పు సమయమిదే
కలుషాత్ముండా తడవేల నికన్
కనుమా నీ తీర్పు సమయమిదే
సిలువను మోసి ఈ లోకమును
తలక్రిందులు చేయు తరుణమిదే…..

Leave a Reply