సిలువలో బలియైన
దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్
వివరింతు శ్రీయేసా
సిలువలో బలియైన
దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్
వివరింతు శ్రీయేసా…
1. ఆనాటి యూదులే నిన్ను
జంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో
నా పాప ఋణమునకే
ఆనాటి యూదులే నిన్ను
జంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో
నా పాప ఋణమునకే
సిలువలో బలియైన
దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్
వివరింతు శ్రీయేసా…
2. నా యతిక్రమములకై
నలుగగొట్టబడి
నా దోషముల నీవు
ప్రియముగను మోసితివా
నా యతిక్రమములకై
నలుగగొట్టబడి
నా దోషముల నీవు
ప్రియముగను మోసితివా
సిలువలో బలియైన
దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్
వివరింతు శ్రీయేసా…
3. మదువైన నీ నుదురు
ముండ్ల పోట్లచేత
సురూపము లేక
సోలిపోతివా ప్రియుడా
మదువైన నీ నుదురు
ముండ్ల పోట్లచేత
సురూపము లేక
సోలిపోతివా ప్రియుడా
సిలువలో బలియైన
దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్
వివరింతు శ్రీయేసా…
4. నా రోగములు నీపై
నమ్రతతో భరియించి
తణీకరింపబడి
ప్రాణమర్పించితివి
నా రోగములు నీపై
నమ్రతతో భరియించి
తణీకరింపబడి
ప్రాణమర్పించితివి
సిలువలో బలియైన
దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్
వివరింతు శ్రీయేసా…
5. వ్యసనాక్రాంతుడవుగా
వ్యాధి ననుభవించి
మౌనము ధరించి
మరణమైతివా ప్రభువా
వ్యసనాక్రాంతుడవుగా
వ్యాధి ననుభవించి
మౌనము ధరించి
మరణమైతివా ప్రభువా
సిలువలో బలియైన
దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్
వివరింతు శ్రీయేసా…
6. నా పాప దోషముచే
నే చచ్చి యుండగనే
మరణమై నాకొరకు
మరి తిరిగి లేచితివా
నా పాప దోషముచే
నే చచ్చి యుండగనే
మరణమై నాకొరకు
మరి తిరిగి లేచితివా
సిలువలో బలియైన
దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్
వివరింతు శ్రీయేసా…
7. పరమున కెత్తబడిన
ప్రియ యేసురాకడకై
పదిలముగ కనిపెట్టి
పాడెదను హల్లెలూయ
పరమున కెత్తబడిన
ప్రియ యేసురాకడకై
పదిలముగ కనిపెట్టి
పాడెదను హల్లెలూయ
సిలువలో బలియైన
దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్
వివరింతు శ్రీయేసా
సిలువలో బలియైన
దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్
వివరింతు శ్రీయేసా…..

Leave a Reply