ప్రేమే శాశ్వతమైన
పరిశుద్ధమైన పొదరిల్లు
ప్రేమే శాశ్వతమైన
పరిశుద్ధమైన పొదరిల్లు

మనస్సే మందిరమాయె
నా మదిలో దీపము నీవే

నిన్నాశ్రయించిన వారిని
ఉదయించు సూర్యునివలెనే
నిరంతరం నీ మాటతో
ప్రకాశింపజేయుదువు

ప్రేమే శాశ్వతమైన
పరిశుద్ధమైన పొదరిల్లు
మనస్సే మందిరమాయె
నా మదిలో దీపము నీవే…

1. అమరమైన నీ చరితం
విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరచిన
పరివర్తన క్షేత్రము

అమరమైన నీ చరితం
విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరచిన
పరివర్తన క్షేత్రము

ఇన్నాళ్లుగ నను స్నేహించి
ఇంతగ ఫలింపజేసితివి
ఈ స్వరసంపదనంతటితో

అభినయించి నే పాడెదను
ఉండలేను బ్రతుకలేను
నీ తోడు లేకుండా నీ నీడలేకుండా

ప్రేమే శాశ్వతమైన
పరిశుద్ధమైన పొదరిల్లు
మనస్సే మందిరమాయె
నా మదిలో దీపము నీవే…

2. కమ్మనైన నీ ఉపదేశము
విజయమిచ్చే శోధనలో
ఖడ్గముకంటే బలమైన వాక్యము
ధైర్యమిచ్చే నా శ్రమలో

కమ్మనైన నీ ఉపదేశము
విజయమిచ్చే శోధనలో
ఖడ్గముకంటే బలమైన
వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో

కరువుసీమలో సిరులొలికించెను
నీ వాక్యప్రవాహము
గగనము చీల్చి మోపైన

దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీ కార్యములు వివరింప
నా తరమా వర్ణింప నా తరమా

ప్రేమే శాశ్వతమైన
పరిశుద్ధమైన పొదరిల్లు
మనస్సే మందిరమాయె
నా మదిలో దీపము నీవే…

3. విధిరాసిన విషాదగీతం
సమసిపోయే నీ దయతో
సంబరమైన వాగ్దానములతో
నాట్యముగా మార్చితివి

విధిరాసిన విషాదగీతం
సమసిపోయే నీ దయతో
సంబరమైన వాగ్దానములతో
నాట్యముగా మార్చితివి

మమతల వంతెన దాటించి
మహిమలో స్థానమునిచ్చితివి
నీ రాజ్యములో జ్యేష్ఠులతో

యుగయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన
ప్రేమ నీకు మరువలేను యేసయ్య

ప్రేమే శాశ్వతమైన
పరిశుద్ధమైన పొదరిల్లు
మనస్సే మందిరమాయె
నా మదిలో దీపము నీవే

నిన్నాశ్రయించిన వారిని
ఉదయించు సూర్యునివలెనే
నిరంతరం నీ మాటతో
ప్రకాశింపజేయుదువు

ప్రేమే శాశ్వతమైన
పరిశుద్ధమైన పొదరిల్లు
మనస్సే మందిరమాయె
నా మదిలో దీపము నీవే…..

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading