1. ప్రీతిగల మన యేసు – ఎంతో గొప్ప మిత్రుడు
మితిలేని దయచేత – హత్తుచు బ్రేమించును
క్రీస్తునొద్ద మన భార – మంత నప్పగించినన్
శక్తిగల యేసు చేత – మోత లెల్ల వీడును
2. నీతిగల మన యేసు – ధ తిగల మిత్రుడు
మ తి బొంది క పతో – వి – శ్రాంతి కలిగించెను
భీతి నొందు బాపులైన – జింతాక్రాంతులైనను
క్రీస్తు యొక్క దీప్తిచేత – క్రొత్తగతి జూతురు
3. దయగల మన యేసు – ప్రియమైన మిత్రుడు
మాయ లోకమందు నిజా – శ్రయుడై కాపాడును
భయ దుఃఖ శ్రమలాది – మోయరాని బాధలన్
జయ మొప్ప నోర్చి యేసు – స్థాయి వ ద్ధి చేయును
4. ధరణిలో యేసుగాక – వేరుగొప్ప మిత్రుడా!
పరలోకమందు నింక – పరమ రక్షకుడా!
నరులను గావ వేగ – గ్రూరహింస పొందుచు
కరుణించి నిల్చి ప్రతి – ప్రార్థనాలకించును

Leave a Reply