[Verse]
ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా
ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా…
[Verse]
1. శ్రేష్ఠమైన భావము గూర్చి
శిష్య బృందముకు నేర్పితివి
శ్రేష్ఠమైన భావము గూర్చి
శిష్య బృందముకు నేర్పితివి
[Verse]
పరముడ నిన్ను ప్రణుతించెదము
పరలోక ప్రార్థన నేర్పుమయా
ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా…
[Verse]
2. పరమ దేవుడవని తెలిసి
కరములెత్తి జంటగ మోడ్చి
పరమ దేవుడవని తెలిసి
కరములెత్తి జంటగ మోడ్చి
[Verse]
శిరమును వంచి సరిగను వేడిన
సుంకరి ప్రార్థన నేర్పుమయా
ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా…
[Verse]
3. దినదినంబు చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవ
దినదినంబు చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవ
[Verse]
దీనుడవయ్యు దిటముగ కొండను
చేసిన ప్రార్థన నేర్పుమయా
ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా…
[Verse]
4. శత్రుమూక నిను చుట్టుకొని
సిలువపైని నిను జంపగను
శత్రుమూక నిను చుట్టుకొని
సిలువపైని నిను జంపగను
[Verse]
శాంతముతో నీ శత్రుల బ్రోవగ
సలిపిన ప్రార్థన నేర్పుమయా
ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా…..

Leave a Reply