పరిశుద్ధుడవై
మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
బలవంతుడవై
దీనుల పక్షమై కృపచూపువాడవు
పరిశుద్ధుడవై
మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
బలవంతుడవై
దీనుల పక్షమై కృపచూపువాడవు
దయాళుడవై ధారాళముగా
నను దీవించిన శ్రీమంతుడా
దయాళుడవై ధారాళముగా
నను దీవించిన శ్రీమంతుడా
ఆరాధన నీకే నా యేసయ్యా
స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా
సేవించెద నిన్నే నా పూర్ణహృదయముతో
సేవించెద నిన్నే నా పూర్ణహృదయముతో
పరిశుద్ధుడవై
మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
బలవంతుడవై
దీనుల పక్షమై కృపచూపువాడవు…
1. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి
నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును
కిరీటముగా ధరింపజేసితివి
నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి
నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును
కిరీటముగా ధరింపజేసితివి
శాశ్వతకాలమువరకు
నీ సంతతిపై దృష్టినిలిపి
నీ దాసుల ప్రార్థనలు
సఫలము చేసితివి
ఆరాధన నీకే నా యేసయ్యా
స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా
సేవించెద నిన్నే నా పూర్ణహృదయముతో
సేవించెద నిన్నే నా పూర్ణహృదయముతో
పరిశుద్ధుడవై
మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
బలవంతుడవై
దీనుల పక్షమై కృపచూపువాడవు…
2. నీ నిత్యమైన ఆదరణచూపి
నను స్థిరపరచుటకు
నీ కరుణా కటాక్షమును
నాపై కురిపించి నను ప్రేమించితివి
నీ నిత్యమైన ఆదరణచూపి
నను స్థిరపరచుటకు
నీ కరుణా కటాక్షమును
నాపై కురిపించి నను ప్రేమించితివి
నాకు ప్రయోజనము కలుగజేయుటకు
నీ ఉపదేశమును బోధించి
నీ దాసుని ప్రాణమును
సంతోషపరచితివి
ఆరాధన నీకే నా యేసయ్యా
స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా
సేవించెద నిన్నే నా పూర్ణహృదయముతో
సేవించెద నిన్నే నా పూర్ణహృదయముతో
పరిశుద్ధుడవై
మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
బలవంతుడవై
దీనుల పక్షమై కృపచూపువాడవు…
3. ఆనందకరమైన దేశములో నేను
నిను ఘనపరచుటకు
నీ మహిమాత్మతో నింపి సురక్షితముగ
నన్ను నివసింపజేసితివి
ఆనందకరమైన దేశములో నేను
నిను ఘనపరచుటకు
నీ మహిమాత్మతో నింపి సురక్షితముగ
నన్ను నివసింపజేసితివి
మేఘవాహనుడవై వచ్చువరకు
నే కనిపెట్టుచుందును నీ కోసము
నీ దాసుల కాంక్షను
సంపూర్ణ పరచెదవు
ఆరాధన నీకే నా యేసయ్యా
స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా
సేవించెద నిన్నే నా పూర్ణహృదయముతో
సేవించెద నిన్నే నా పూర్ణహృదయముతో
పరిశుద్ధుడవై
మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
బలవంతుడవై
దీనుల పక్షమై కృపచూపువాడవు
పరిశుద్ధుడవై
మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
బలవంతుడవై
దీనుల పక్షమై కృపచూపువాడవు
దయాళుడవై ధారాళముగా
నను దీవించిన శ్రీమంతుడా
దయాళుడవై ధారాళముగా
నను దీవించిన శ్రీమంతుడా
ఆరాధన నీకే నా యేసయ్యా
స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా
సేవించెద నిన్నే నా పూర్ణహృదయముతో
సేవించెద నిన్నే నా పూర్ణహృదయముతో
ఆరాధన నీకే నా యేసయ్యా
స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా
సేవించెద నిన్నే నా పూర్ణహృదయముతో
సేవించెద నిన్నే నా పూర్ణహృదయముతో…..

Leave a Reply