Yesu Nee Namamruthamu
[Verse]
యేసు నీ నామామృతము
మాకెంత రుచియయ్యా దేవా
యేసు నీ నామామృతము
మాకెంత రుచియయ్యా
[Verse]
మా దోసములను హరించి
మోక్ష నివాసులుగ జేయుటకు
భాసుర ప్రకాశమైన
[Verse]
యేసు నీ నామామృతము
మాకెంత రుచియయ్యా…
[Verse]
1. వేడుకలరగ గూడి నిను గొని
యాడు వారికి దేవా
వేడుకలరగ గూడి
నిను గొనియాడు వారికి
[Verse]
యెంతో కీడు జేసిన పాడు వైరిని
గోడు గోడనంగ వాని
తాడనము జేసితివి
[Verse]
యేసు నీ నామామృతము
మాకెంత రుచియయ్యా…
[Verse]
2. పాపములు హరింప నీవే
ప్రాపు మాకయ్యా దేవా
పాపములు హరింప నీవే
ప్రాపు మాకయ్యా
[Verse]
నీ దాపు జేరిన వారికందరి
కాపదలు బాపి నిత్య
కాపుగతి జూపినావు
[Verse]
యేసు నీ నామామృతము
మాకెంత రుచియయ్యా…
[Verse]
3. అక్షయ కరుణేక్ష భువనా
రక్షకా నీవే దేవా
అక్షయ కరుణేక్ష భువనా
రక్షకా నీవే
[Verse]
మమ్ము పక్షముగ రక్షించి
మోక్ష సు రక్షణకు దీక్షగొని
వీక్షితులమైన మాకు
[Verse]
యేసు నీ నామామృతము
మాకెంత రుచియయ్యా…
[Verse]
4. అందమగు నీ మందిరమున
బొందుగ మేము దేవా
అందమగు నీ మందిరమున
బొందుగ మేము
[Verse]
నీ సుందర కరుణామృతము
మా డెందముల యందు
గ్రోలుటందుకు సుందరమైన
[Verse]
యేసు నీ నామామృతము
మాకెంత రుచియయ్యా …..

Leave a Reply