Yesu Nannu Preminchinavu
[Verse]
యేసు నన్ను ప్రేమించినావు
పాపినైన
నన్ను ప్రేమించినావు…
[Verse]
1. నన్ను ప్రేమింప
మా -నవరూప మెత్తి దా
నముగా జీవము సిల్వపై
నిచ్చి కన్న తలిదండ్రుల
యన్నదమ్ముల ప్రేమ
కన్న మించిన ప్రేమతో
[Verse]
యేసు నన్ను ప్రేమించినావు
పాపినైన
నన్ను ప్రేమించినావు…
[Verse]
2. తల్లి గర్భమున నే
ధరియింపబడి నపుడే
దురితుండనై యుంటిని
నా వల్ల జేయబడెడు
నెల్ల కార్యము లెప్పు
డేహ్యంబులై యుండగ
[Verse]
యేసు నన్ను ప్రేమించినావు
పాపినైన
నన్ను ప్రేమించినావు…
[Verse]
3. మంచి నాలో పుట్ట
దంచు నీ వెరిగి నన్
మించ బ్రేమించి నావు
ఆహా యెంచ శక్యముగాని
మంచి నాలో బెంచ
నెంచి ప్రేమించినావు
[Verse]
యేసు నన్ను ప్రేమించినావు
పాపినైన
నన్ను ప్రేమించినావు…
[Verse]
4. నన్ను బ్రేమింప నీ
కున్న కష్టము లన్ని
మున్నై తెలిసియుంటివి
తెలిసి నన్ను బ్రేమింప నీ
కున్న కారణమేమో
యన్నా తెలియదు చిత్రము
[Verse]
యేసు నన్ను ప్రేమించినావు
పాపినైన
నన్ను ప్రేమించినావు…
[Verse]
5. నా వంటి నరుడొకడు
నన్ను ప్రేమించిన
నా వలన ఫలము గోరు
ఆహా నీవంటి పుణ్యునికి
నా వంటి పాపితో
కేవలంబేమి లేక
[Verse]
యేసు నన్ను ప్రేమించినావు
పాపినైన
నన్ను ప్రేమించినావు…..

Leave a Reply