Yesu Nadu Kapari Vani
[Verse]
యేసు నాదు కాపరి వాని
వాసిగా స్తుతించెదన్
యేసు గొఱ్ఱెపిల్లను
పోయెదను తనవెంట
[Verse]
యేసు నాదు కాపరి వాని
వాసిగా స్తుతించెదన్
యేసు గొఱ్ఱెపిల్లను
పోయెదను తనవెంట…
[Verse]
1. పచ్చిక పట్లకు
మచ్చికతో నడుపున్
స్వచ్ఛజలముల చెంత
నిచ్చును విశ్రాంతి
[Verse]
ముందు ముందు వెళ్లుచు
పొందుగ రక్షించు నన్ను
తన మాధుర్య స్వరంబున
తనవి దీర్చును
[Verse]
యేసు నాదు కాపరి వాని
వాసిగా స్తుతించెదన్
యేసు గొఱ్ఱెపిల్లను
పోయెదను తనవెంట…
[Verse]
2.మరణలోయ ద్వారా
సరిగా నడిపించును
అడవి భయములెల్ల
ఎడబాపి రక్షించున్
[Verse]
హత్తి ఒత్తి కట్టి గాయాలెంతో
ఆదరించును
వింతగు వాని ప్రేమ సేవలో
సంతోషింతును
[Verse]
యేసు నాదు కాపరి వాని
వాసిగా స్తుతించెదన్
యేసు గొఱ్ఱెపిల్లను
పోయెదను తనవెంట…
[Verse]
3.శత్రులముందాహారం
సంసిద్ధము జేయును
నా గిన్నె నిండించి
పొర్లి పారజేసి
[Verse]
కడిగి కడిగి శుద్ధిజేసి
ఆత్మదాన మిచ్చెను
వడిగా వాని సాయమున
జయమున వెళ్ళెదము
[Verse]
యేసు నాదు కాపరి వాని
వాసిగా స్తుతించెదన్
యేసు గొఱ్ఱెపిల్లను
పోయెదను తనవెంట…..

Leave a Reply