Yesayya Nee Prema Na Sonthamu
యేసయ్య నీ ప్రేమ నా సొంతము
నాలోన పలికిన స్తుతి గీతము
యేసయ్య నీ ప్రేమ నా సొంతము
నాలోన పలికిన స్తుతి గీతము
యేసయ్య నీవేగా తొలి కిరణము
నాలోన వెలిగిన రవి కిరణము
ఏనాడు ఆరని నా దీపము
నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము
నాలోన నిత్యము ఒక సంబరం
యేసయ్య నీ ప్రేమ నా సొంతము
నాలోన పలికిన స్తుతి గీతము
యేసయ్య నీవేగా తొలి కిరణము
నాలోన వెలిగిన రవి కిరణము…
1. ఏపాటి నన్ను ప్రేమించినావు
నీ ప్రేమలోనే నను దాచినావు
ఏపాటి నన్ను ప్రేమించినావు
నీ ప్రేమలోనే నను దాచినావు
నా భారమంతా నువు మోసినావు
నన్నెంతగానో హెచ్చించినావు
నీ కృపలోనే నను కాచినావు
నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్యధ్యానం
నా మదిలోనే నీ నామస్మరణం
నిన్నే ఆరాధించి నీ దయలో నే జీవించి
నిన్నే నే పూజించి నీలో నే తరియించి
యేసయ్య నీ ప్రేమ నా సొంతము
నాలోన పలికిన స్తుతి గీతము
యేసయ్య నీవేగా తొలి కిరణము
నాలోన వెలిగిన రవి కిరణము…
2. ఏనాడు నన్ను విడనాడలేదు
నీ నీడలోనే నడిపించినావు
ఏనాడు నన్ను విడనాడలేదు
నీ నీడలోనే నడిపించినావు
లోకాలనేలే రారాజు నీవే
నా జీవనావకు రహదారి నీవే
నా గురి నీవే నా యేసుదేవా
చేరితి నిన్నే నా ప్రాణనాథా
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం
ఉన్నతమైనది నీ దివ్య చరితం
సాటే లేరు నీకు సర్వాధికారివి నీవు
మారని దైవం నీవు మహిమోన్నతుడవు నీవు
యేసయ్య నీ ప్రేమ నా సొంతము
నాలోన పలికిన స్తుతి గీతము
యేసయ్య నీ ప్రేమ నా సొంతము
నాలోన పలికిన స్తుతి గీతము
యేసయ్య నీవేగా తొలి కిరణము
నాలోన వెలిగిన రవి కిరణము
ఏనాడు ఆరని నా దీపము
నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము
నాలోన నిత్యము ఒక సంబరం
యేసయ్య నీ ప్రేమ నా సొంతము
నాలోన పలికిన స్తుతి గీతము
యేసయ్య నీవేగా తొలి కిరణము
నాలోన వెలిగిన రవి కిరణము…

Leave a Reply