Yesayya Nannu Korukunna
యేసయ్యా నన్ను కోరుకొన్న
నిజ స్నేహితుడా
నీ యవ్వన రక్తము కార్చి
నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు (2)
నిను వీడి జీవింప నా తరమా?
నిను ఆరాధింప నా బలమా?
మది మందిరాన
కొలువైన నా వరమా!!! (2)
1. నా పూర్ణహృదయముతో నిను వెదకితిని
నీ ఆజ్ఞలను విడిచి నను తిరుగనియ్యకుము (2)
ధైర్యమునిచ్చే నీ వాక్యముతో
నీ బలమును పొంది దుష్టుని ఎదిరింతును (2)
యేసయ్యా నన్ను కోరుకొన్న
నిజ స్నేహితుడా
నీ యవ్వన రక్తము కార్చి
నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు (2)
నిను వీడి జీవింప నా తరమా?
నిను ఆరాధింప నా బలమా?
మది మందిరాన
కొలువైన నా వరమా!!! (2)
2. నా గురి గమ్యమైన నిను చేరుటకు
ఈ లోకనటనలు చూసి నను మురిసిపోనివ్వకు (2)
పొందబోవు బహుమానముకై
నా సిలువను మోయుచు నిను వెంబడించెదను
యేసయ్యా నన్ను కోరుకొన్న
నిజ స్నేహితుడా
నీ యవ్వన రక్తము కార్చి
నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు (2)
నిను వీడి జీవింప నా తరమా?
నిను ఆరాధింప నా బలమా?
మది మందిరాన
కొలువైన నా వరమా!!! (2)

Leave a Reply