Yesayya Na Pranama

[Verse]
యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా
యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా

[Verse]
అద్భుతమైన నీ ఆదరణే – ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను – నే అలయక నడిపించెను

[Verse]
నా జీవమా – నా స్తోత్రమా నీకే ఆరాధన
నా స్నేహము – సంక్షేమము – నీవే ఆరాధ్యుడా

[Verse]
యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా…

[Verse]
1. చిరకాలము నాతో ఉంటానని – క్షణమైనా వీడిపోలేదని
నీలో నను చేర్చుకున్నావని – తండ్రితో ఏకమై ఉన్నామని

[Verse]
ఆనందగానము నే పాడనా – ఆనందగానము నే పాడనా

[Verse]
ఏదైనా నాకున్న సంతోషము – నీతోనే కలిగున్న అనుబంధమే
ఏదైనా నాకున్న సంతోషము – నీతోనే కలిగున్న అనుబంధమే

[Verse]
సృజనాత్మకమైన నీకృప చాలు – నే బ్రతికున్నది నీ కోసమే
సృజనాత్మకమైన నీకృప చాలు – నే బ్రతికున్నది నీ కోసమే

[Verse]
యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా
యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా

[Verse]
అద్భుతమైన నీ ఆదరణే – ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను – నే అలయక నడిపించెను

[Verse]
నా జీవమా – నా స్తోత్రమా నీకే ఆరాధన
నా స్నేహము – సంక్షేమము – నీవే ఆరాధ్యుడా

[Verse]
యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా…

[Verse]
2. జీవజలముగా నిలిచావని – జలనిధిగా నాలో ఉన్నావని
జనులకు దీవెనగా మార్చావని – జగతిలో సాక్షిగా ఉంచావని

[Verse]
ఉత్సాహగానము నే పాడనా – ఉత్సాహగానము నే పాడనా

[Verse]
ఏదైనా నీకొరకు చేసేందుకు – ఇచ్చితివి బలమైన నీశక్తిని
ఏదైనా నీకొరకు చేసేందుకు – ఇచ్చితివి బలమైన నీశక్తిని

[Verse]
ఇదియే చాలును – నా జీవితాంతము
ఇల నాకన్నియు – నీవేకదా

[Verse]
ఇదియే చాలును – నా జీవితాంతము
ఇల నాకన్నియు – నీవేకదా

[Verse]
యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా
యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా

[Verse]
అద్భుతమైన నీ ఆదరణే – ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను – నే అలయక నడిపించెను

[Verse]
నా జీవమా – నా స్తోత్రమా నీకే ఆరాధన
నా స్నేహము – సంక్షేమము – నీవే ఆరాధ్యుడా

[Verse]
యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా…

[Verse]
3. మధురముకాదా నీ నామధ్యానం – మరపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు నను నడుపువైనం – క్షేమముగా నా ఈలోకపయనం

[Verse]
స్తోత్రగీతముగా నేపాడనా – స్తోత్రగీతముగా నేపాడనా

[Verse]
నిజమైన అనురాగం చూపావయ్యా – స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
నిజమైన అనురాగం చూపావయ్యా – స్థిరమైన అనుబంధం నీదేనయ్యా

[Verse]
స్తుతుల సింహాసనం నీకొరకేగా – ఆసీనుడవై నను పాలించవా
స్తుతుల సింహాసనం నీకొరకేగా – ఆసీనుడవై నను పాలించవా

[Verse]
యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా
యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా

[Verse]
అద్భుతమైన నీ ఆదరణే – ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను – నే అలయక నడిపించెను

[Verse]
నా జీవమా – నా స్తోత్రమా నీకే ఆరాధన
నా స్నేహము – సంక్షేమము – నీవే ఆరాధ్యుడా

[Verse]
స్తుతిపాత్రుడా – స్తోత్రర్హుడా – నీకే ఆరాధన
స్తుతిపాత్రుడా – స్తోత్రర్హుడా – నీకే ఆరాధన

[Verse]
ఆనందమే పరమానందమే – నీలో నా యేసయ్యా
ఆనందమే పరమానందమే – నీలో నా యేసయ్యా

[Verse]
స్తుతిపాత్రుడా – స్తోత్రర్హుడా – నీకే ఆరాధన
స్తుతిపాత్రుడా – స్తోత్రర్హుడా – నీకే ఆరాధన

[Verse]
ఆనందమే పరమానందమే – నీలో నా యేసయ్యా
ఆనందమే పరమానందమే – నీలో నా యేసయ్యా…..

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading