Yehova Sannidhini Nee Stotra
[Verse]
యెహోవా సన్నిధిని
నీ స్తోత్రగానముతో
యెహోవా సన్నిధిని
నీ స్తోత్రగానముతో
[Verse]
మహోపకారునకు
మహోపకారునకు
మానుగ నర్పణ సమర్పించుడి
యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో…
[Verse]
1. ప్రభువడుగు నర్పణలు
ప్రేమ కృతజ్ఞతలు
ప్రభువడుగు నర్పణలు
ప్రేమ కృతజ్ఞతలు
[Verse]
అభయ ప్రధానములు
అభయ ప్రధానములు
విభునకు నియ్యుడు విరివిగను
యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో…
[Verse]
2. రిక్త హస్తములతో
రావలదు సన్నిధికి
రిక్త హస్తములతో
రావలదు సన్నిధికి
[Verse]
భక్తవత్సలునకు
భక్తవత్సలునకు
శక్తి కొలది మీ రర్పించుడి
యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో…
[Verse]
3. శృంగారాలయ మిలలో
పొంగార గట్టుటకు
శృంగారాలయ మిలలో
పొంగార గట్టుటకు
[Verse]
బంగారు వెండియును
బంగారు వెండియును
బాగుగ నియ్యుడి ప్రభుపేర
యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో…
[Verse]
4. వరుమానములచేత
వాంఛింప వలదండి
వరుమానములచేత
వాంఛింప వలదండి
[Verse]
గురునాజ్ఞ చొప్పునను
గురునాజ్ఞ చొప్పునను
విరివిగ హృదయములర్పించుడి
యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో…
[Verse]
5. యెహోవ జనులారా
యియ్యండి మనసార
యెహోవ జనులారా
యియ్యండి మనసార
[Verse]
యెహోవా యిచ్చినది
యెహోవా యిచ్చినది
యేసున కర్పణ చెల్లింతము
యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో…..

Leave a Reply