Yehovanu Ganamu Chesedamu
యెహోవాను గానము
చేసెదము యేకముగా
మనకు రక్షకుడాయానే
ఆయన మహిమా పాడెదము
ఆయనను వర్ణించెదము
ఆయనే దేవుడు మనకు
1. యుద్ధశూరుడెహోవా
నా బలము నా గానము
యుద్ధశూరుడెహోవా
నా బలము నా గానము
నా పితరుల దేవుడు
ఆయన పేరు యెహోవా
యెహోవాను గానము
చేసెదము యేకముగా
మనకు రక్షకుడాయానే
ఆయన మహిమా పాడెదము…
2. ఫరో రథముల సేనలను
తన శ్రేష్ఠాధిపతులను
ఫరో రథముల సేనలను
తన శ్రేష్ఠాధిపతులను
ఎర్రసముద్రములోన
ముంచివేసె నెహోవా
యెహోవాను గానము
చేసెదము యేకముగా
మనకు రక్షకుడాయానే
ఆయన మహిమా పాడెదము…
3. నీ మహిమాతిశయమున
కోపాగ్ని రగులజేసి
నీ మహిమాతిశయమున
కోపాగ్ని రగులజేసి
చెత్తవలె దహించెదవు
నీపై లేచువారిని
యెహోవాను గానము
చేసెదము యేకముగా
మనకు రక్షకుడాయానే
ఆయన మహిమా పాడెదము…
4. దోపుడు సొమ్ము పంచుకొని
ఆశ తీర్చుకొందును
దోపుడు సొమ్ము పంచుకొని
ఆశ తీర్చుకొందును
నా కత్తి దూసెదను
అని శత్రువనుకొనెను
యెహోవాను గానము
చేసెదము యేకముగా
మనకు రక్షకుడాయానే
ఆయన మహిమా పాడెదము…
5. వేల్పులలో నీ సముడెవడు
పరిశుద్ధమహనీయుడా
వేల్పులలో నీ సముడెవడు
పరిశుద్ధమహనీయుడా
అద్భుతమైన పూజ్యుడా
నీ వంటి వాడెవడు
యెహోవాను గానము
చేసెదము యేకముగా
మనకు రక్షకుడాయానే
ఆయన మహిమా పాడెదము…
6. ఇశ్రాయేలీయులంతా
ఎంతో సురక్షితముగా
ఇశ్రాయేలీయులంతా
ఎంతో సురక్షితముగా
సముద్రము మధ్యను
ఆరిన నేలను నడిచిరి
యెహోవాను గానము
చేసెదము యేకముగా
మనకు రక్షకుడాయానే
ఆయన మహిమా పాడెదము
ఆయనను వర్ణించెదము
ఆయనే దేవుడు మనకు…..

Leave a Reply