Yehova Sannee Stotra
యెహోవా సన్నిధిని – నీ స్తోత్రగానముతో
యెహోవా సన్నిధిని – నీ స్తోత్రగానముతో
మహోపకారునకు – మహోపకారునకు
మానుగ నర్పణ సమర్పించుడి
యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో…
1. ప్రభువడుగు నర్పణలు – ప్రేమ కృతజ్ఞతలు
ప్రభువడుగు నర్పణలు – ప్రేమ కృతజ్ఞతలు
అభయ ప్రధానములు – అభయ ప్రధానములు
విభునకు నియ్యుడు విరివిగను
యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో…
2. రిక్త హస్తములతో – రావలదు సన్నిధికి
రిక్త హస్తములతో – రావలదు సన్నిధికి
భక్తవత్సలునకు – భక్తవత్సలునకు
శక్తి కొలది మీ రర్పించుడి
యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో…
3. శృంగారాలయ మిలలో – పొంగార గట్టుటకు
శృంగారాలయ మిలలో – పొంగార గట్టుటకు
బంగారు వెండియును – బంగారు వెండియును
బాగుగ నియ్యుడి ప్రభుపేర
యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో…
4. వరుమానములచేత – వాంఛింప వలదండి
వరుమానములచేత – వాంఛింప వలదండి
గురునాజ్ఞ చొప్పునను – గురునాజ్ఞ చొప్పునను
విరివిగ హృదయములర్పించుడి
యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో…
5. యెహోవ జనులారా – యియ్యండి మనసార
యెహోవ జనులారా – యియ్యండి మనసార
యెహోవా యిచ్చినది – యెహోవా యిచ్చినది
యేసున కర్పణ చెల్లింతము
యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో…..

Leave a Reply