Vijayageethamul Padare
విజయగీతముల్ పాడరే క్రీస్తుకు జయ
విజయగీతముల్ పాడరే
వృజినమంతటి మీద విజయమిచ్చెడు దేవ
నిజకుమారుని నామమున్
హృదయములతో భజన జేయుచు నిత్యమున్
1. మంగళముగ యేసుడే మనకు రక్షణ
శృంగమై మరి నిల్చెను
నింగిన్ విడిచి వచ్చెను శత్రుని యుద్ధ
రంగమందున గెల్చెను
రంగుమీరగదన రక్తబలము వలన
పొంగు నణగజేసెను
సాతానుని బల్ క్రుంగ నలిపి చీల్చెను
విజయగీతముల్ పాడరే క్రీస్తుకు జయ
విజయగీతముల్ పాడరే
2. పాపముల్ దొలగింపను మనలను దన స్వ
రూపంబునకు మార్పను
శాపంబంతయు నోర్చెను దేవుని న్యాయ
కోపమున్ భరియించెను
పాపమెరుగని యేసు పాపమై మనకొరకు
పాపయాగము దీర్చెను
దేవుని నీతిన్ ధీరుడై నెరవేర్చెను
విజయగీతముల్ పాడరే క్రీస్తుకు జయ
విజయగీతముల్ పాడరే
3. సిలువ మరణము నొందియు మనలను దనకై
గెలువన్ లేచిన వానికి
చెలువుగన్ విమలాత్ముని ప్రేమను మనలో
నిలువన్ జేసిన వానికి
కొలువు జేతుమెగాని ఇలను మరువక వాని
సిలువ మోయుచు నీ కృపా
రక్షణ చాల విలువ గలదని చాటుచు
విజయగీతముల్ పాడరే క్రీస్తుకు జయ
విజయగీతముల్ పాడరే

Leave a Reply