Vijayasheeluda Na Prana
విజయశీలుడా నా ప్రాణప్రియుడా
కృతజ్ఞతతో నిను స్తుతించెదను
నా యేసయ్యా నిను వేడుకొనగా
నా కార్యములన్నియు సఫలము చేసితివి
1. అలసిన సమయమున నా ప్రాణమునకు
త్రాణ పుట్టించినావు
అలసిన సమయమున నా ప్రాణమునకు
త్రాణ పుట్టించినావు
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి
ధైర్యముతో నింపినావు
నిత్యానందము కలిగించే నీ
శుభవచనములతో నెమ్మదినిచ్చితివి
నిత్యానందము కలిగించే నీ
శుభవచనములతో నెమ్మదినిచ్చితివి
విజయశీలుడా నా ప్రాణప్రియుడా
కృతజ్ఞతతో నిను స్తుతించెదను…
2. ఆశ్యర్యకరముగ నీ బాహువు చాపి
విడుదల కలిగించినావు
ఆశ్యర్యకరముగ నీ బాహువు
చాపి విడుదల కలిగించినావు
ఆరణ్య మార్గమున విడువక తోడై
విజయముతో నడిపినావు
నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి
వాగ్దాన భూమిలో చేర్చిన దేవా
విజయశీలుడా నా ప్రాణప్రియుడా
కృతజ్ఞతతో నిను స్తుతించెదను…
3. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో
ఆశ్రయమిచ్చితివి నాకు
అక్షయుడా నా సంపూర్ణతకై
మహిమాత్మతో నింపినావు
నిత్యము నీతో నేనుండుటకై
నూతన యెరూషలేం నిర్మించుకున్నావు

Leave a Reply