Shashwithuda Vismayamondi
1. శాశ్వతుడా! విస్మయమొంది నేను
నీ స్వంతహస్త సృష్టిజూడగా
నీ స్వరం విందున్ ఉరుములయందు
యేసు ప్రభూ నిన్నారాధింతున్
ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్
నూరంతలన్ మహాదేవా
నా రక్షకా! నమస్కరింతునిన్
మారని యో మహాదేవా
2. వృక్షంబులందున్, అడవులలోనే
పక్షుల పాటలాలకింతును
తక్షణ మగ్రపర్వతంబు నుండి
అక్షులతో నీ మహిమ గందున్.
ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్
నూరంతలన్ మహాదేవా
నా రక్షకా! నమస్కరింతునిన్
మారని యో మహాదేవా
3. మహాదేవా! నీయేక పుత్రుండిలన్
నా హేయపాపముల్ భరించి, నా
సహాయుడై తా మరణించె నంచు
ఓహో! యాశ్చర్యపడి స్మరింతున్
ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్
నూరంతలన్ మహాదేవా
నా రక్షకా! నమస్కరింతునిన్
మారని యో మహాదేవా
4. క్రీస్తు విజయార్భాటముతో వచ్చి
నీ స్థలమందు నన్ను జేర్చగా
నే స్థిరతుష్టితో సాష్టాంగపడి
నీ స్తుతి జేతునో మహాదేవా
ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్
నూరంతలన్ మహాదేవా
నా రక్షకా! నమస్కరింతునిన్
మారని యో మహాదేవా

Leave a Reply