Seeyonu Patalu Santhoshamuga

సీయోను పాటలు సంతోషముగ
పాడుచు సీయోను వెళ్ళుదము
1. లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు
పొందవలె నీ లోకము నందు
కొంత కాల మెన్నో శ్రమలు

సీయోను పాటలు సంతోషముగ
పాడుచు సీయోను వెళ్ళుదము
2. ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్య వాసులె ఈ ధరలో
నిత్య నివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై నిల్పుడి

సీయోను పాటలు సంతోషముగ
పాడుచు సీయోను వెళ్ళుదము
3. మారాను పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసియున్న నేమి
నీ రక్షకుండగు యేసే నడుపును
మారాని తనదు మాటనమ్ము

సీయోను పాటలు సంతోషముగ
పాడుచు సీయోను వెళ్ళుదము
4. ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి
పాడైన కోరహు పాపంబుమాని
విధేయులై విరాజిల్లుడి

సీయోను పాటలు సంతోషముగ
పాడుచు సీయోను వెళ్ళుదము
5. ఆనందమయ పరలోకంబు మనది
అక్కడ నుండి వచ్చునేసు
సీయోను గీతము సొంపుగ కలసి
పాడెదము ప్రభుయేసుకు జై.

సీయోను పాటలు సంతోషముగ
పాడుచు సీయోను వెళ్ళుదము

Leave a Reply