Seeyonu Kanya Sambrama Paduchu

[Verse]
సీయోను కన్యా సంభ్రమపడుచు
వేయుము కేకల్‌
సీయోను కన్యా సంభ్రమపడుచు
వేయుము కేకల్‌

[Verse]
పాయక నీ రాజు
భారవాహకమెక్కి
బాలస్తోత్రములతో
బయలుదేరి వచ్చె

[Verse]
సీయోను కన్యా సంభ్రమపడుచు
వేయుము కేకల్‌…

[Verse]
1. హెబ్రాయిలోను నీ రాజు పేరు
యూదులరాజు
హెబ్రాయిలోను నీ రాజు పేరు
యూదులరాజు

[Verse]
హెెబ్రీయ జనులను
అబ్రాము కొడుకులను
విభవదేశము జేర్చు
శుభరాజు యీతండే

[Verse]
సీయోనుకన్యా సంభ్రమపడుచు
వేయుము కేకల్‌…

[Verse]
2. హెల్లేనీలోను నీ రాజు పేరు
యూదులరాజే
హెల్లేనీలోను నీ రాజు పేరు
యూదులరాజే

[Verse]
యెల్ల పాపుల బ్రోచు
తాల్మి రక్షకుడితడు
చల్లని ప్రభువని
గొల్గొత మ్రోగెను

[Verse]
సీయోనుకన్యా సంభ్రమపడుచు
వేయుము కేకల్‌…

[Verse]
3. ఉర్వి రోమాలో నీ రాజు పేరు
యూదులరాజే
ఉర్వి రోమాలో నీ రాజు పేరు
యూదులరాజే

[Verse]
సర్వరాష్ట్రికులకు
బూర్వపితరులతోను
వరసింహాసన మిచ్చు
వరదేశాధిపుడితడు

[Verse]
సీయోనుకన్యా సంభ్రమపడుచు
వేయుము కేకల్‌…

[Verse]
4. వాసిగ హెబ్రీ హెల్లేనీలో
రోమాయిలోను
వాసిగ హెబ్రీ హెల్లేనీలో
రోమాయిలోను

[Verse]
హోసన్నా హోసన్నా
ప్రభువు పేరటవచ్చు
మెస్సీయ్య దావీదు
కొడుకా శ్రీశుభములు

[Verse]
సీయోను కన్యా సంభ్రమపడుచు
వేయుము కేకల్‌
సీయోను కన్యా సంభ్రమపడుచు
వేయుము కేకల్‌

[Verse]
పాయక నీ రాజు
భారవాహకమెక్కి
బాలస్తోత్రములతో
బయలుదేరి వచ్చె

[Verse]
సీయోను కన్యా సంభ్రమపడుచు
వేయుము కేకల్‌
వేయుము కేకల్‌
వేయుము కేకల్‌…..

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading