Sarvashakthuni Stotraganamu
సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను
సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను
నిర్వహించును దాసభారము
నిర్వహించును దాసభారము
నిత్య మెద రాజిల్లను
సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను…
1. ముదముతో నిర్మాణకుండగు
మూలకర్తను బాడరే
ముదముతో నిర్మాణకుండగు
మూలకర్తను బాడరే
వదన మీక్ష్మాన్వంచి దేవుని
వదన మీక్ష్మాన్వంచి దేవుని
వందనముతో బాడరే
సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను…
2. వేద పారాయణము సేయుచు
విశ్వమంత జయింపరే
వేద పారాయణము సేయుచు
విశ్వమంత జయింపరే
సాదరముగా దేవునిక మీ
సాదరముగా దేవునిక
మీ స్వాంతమున బూజింపరే
సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను…
3. ఎదను విశ్రాంతిన్ పరేశుని
హెచ్చుగా నుతి జేయరే
ఎదను విశ్రాంతిన్ పరేశుని
హెచ్చుగా నుతి జేయరే
సదమ లంబగు భక్తితో మీ
సదమ లంబగు భక్తితో
మీ సర్వమాయన కీయరే
సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను…
4. చావు పుట్టుక లేనివాడుగ
సంతతము జీవించును
చావు పుట్టుక లేనివాడుగ
సంతతము జీవించును
ఈవులిచ్చుచు దన్ను వేడుమ
ఈవులిచ్చుచు దన్ను వేడు
మహేష్టులను రక్షించును
సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను…
5. దాసులై దేవునికి నెదలో
దర్పమును బో గాల్పరే
దాసులై దేవునికి నెదలో
దర్పమును బో గాల్పరే
యేసు క్రీస్తుని పుణ్య వస్త్రము
యేసు క్రీస్తుని పుణ్య వస్త్రము
నే మరక మై దాల్పరే
సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను…..

Leave a Reply