Samarpana Cheyumu Prabhuvunaku
సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును
1. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు
ఇస్సాకును అర్పణ ఇమ్మనెను
నీ బిడ్డలసేవకు నిచ్చెదవా నీ విచ్చెదవా
సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును
2. ప్రియము దేవునికి హేబెలు బలి
హేయము కయీనుని అర్పణము
కళంకము కల్మషమంటనివి
నీ విచ్చెదవా
సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును
3. ఐదు రొట్టెలు చేపలు రెండు
ఐదు వేలకు ఆహారముగా
అర్పించినా బాలుడాకటివేళ
నీ విచ్చెదవా
సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును
4. ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెను కానుకగా
జీవనమంతయు దేవునికిచ్చెను
నీ విచ్చెదవా
సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును
5. నీ దేహము దేవుని ఆలయము
నీ దేవుడు మలచిన మందిరము
సజీవయాగముగా
నీ విచ్చెదవా
సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును
Leave a Reply