Samanulevaru Prabho
సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో
సమానులెవరు ప్రభూ
సమస్తమానవ శ్రమాను భవమున్
సహించి వహించి ప్రేమించగలనీ
1. సమానతత్వము సహోదరత్వము
సమంజసముగను మాకు తెలుపనీ
2. పరార్ధమై భవ శరీరమొసగిన
పరోపకార నరావతారా
3. దయాహదయ యీ దుర్మార్గులెల్లరిన్
నయానా భయానా దయాన బ్రోవనీ
4. ఓ పావనాత్ముడా ఓ పుణ్యశీలుడా
పాపాత్ములను బ్రోవ పరమాత్మసుతనీ
Leave a Reply