Priya Yesu Rajunu Ne Chuchina

[Verse]
ప్రియయేసు రాజును
నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో
నుంటే చాలు

[Verse]
నిత్యమైన మోక్ష
గృహమునందు చేరి
భక్తుల గుంపులో
హర్షించిన చాలు

[Verse]
1. యేసుని రక్తమందు కడుగబడి
వాక్యముచే నిత్యం భద్రపరచబడి
నిష్కళంక పరిశుద్ధులతో పేదన్‌ నేను
బంగారు వీధులలో తిరిగెదను

[Verse]
ప్రియయేసు రాజును
నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో
నుంటే చాలు

[Verse]
2. దూతలు వీణలను మీటునపుడు
గంభీర జయధ్వనులు మ్రోగునపుడు
హల్లెలూయ పాటను పాడుచుండ
ప్రియ యేసుతోను నేను యుల్లసింతున్‌

[Verse]
ప్రియయేసు రాజును
నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో
నుంటే చాలు

[Verse]
3. ముండ్ల మకుటంబైన తలను జూచి
స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్‌
కొరడాతో కొట్టబడిన వీపున్‌ జూచి
ప్రతియొక్క గాయమును ముద్దాడెదన్‌

[Verse]
ప్రియయేసు రాజును
నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో
నుంటే చాలు

[Verse]
4. హృదయము స్తుతులతో నింపబడె
నా భాగ్య గృహమును స్మరించుచుంటే
హల్లెలూయ ఆమెన్‌ హల్లెలూయ
వర్ణింప నా నాలుక చాలదయ్యా

[Verse]
ప్రియయేసు రాజును
నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో
నుంటే చాలు

[Verse]
5. ఆహా యా బూర యెపుడు ధ్వనించునో
ఆహో నాయాశ యెపుడు తీరుతుందో
తండ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో
ఆశతో వేచియుండే నా హృదయం

[Verse]
ప్రియయేసు రాజును
నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో
నుంటే చాలు

[Verse]
నిత్యమైన మోక్ష
గృహమునందు చేరి
భక్తుల గుంపులో
హర్షించిన చాలు

Leave a Reply