Priya Yesu Nirminchithivi

[Verse]
ప్రియయేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం
ముదమార వసియించు నా
హృదయాంతరంగమున

[Verse]
ప్రియయేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం
ముదమార వసియించు నా
హృదయాంతరంగమున…

[Verse]
1. నీ రక్త ప్రభావమున
నా రోత హృదయంబును
నీ రక్త ప్రభావమున
నా రోత హృదయంబును

[Verse]
పవిత్ర పరచుము తండ్రీ
ప్రతి పాపమును కడిగి
పవిత్ర పరచుము తండ్రీ
ప్రతి పాపమును కడిగి

[Verse]
ప్రియయేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం
ముదమార వసియించు నా
హృదయాంతరంగమున…

[Verse]
2. అజాగరూకుడనైతి
నిజాశ్రయము విడిచి
అజాగరూకుడనైతి
నిజాశ్రయము విడిచి

[Verse]
కరుణారసముతో నాకై
కనిపెట్టితివి తండ్రీ
కరుణారసముతో నాకై
కనిపెట్టితివి తండ్రీ

[Verse]
ప్రియయేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం
ముదమార వసియించు నా
హృదయాంతరంగమున…

[Verse]
3. వికసించె విశ్వాసంబు
వాక్యంబును చదువగనె
వికసించె విశ్వాసంబు
వాక్యంబును చదువగనె

[Verse]
చేరితి నీదు దారి
కోరి నడిపించుము
చేరితి నీదు దారి
కోరి నడిపించుము

[Verse]
ప్రియయేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం
ముదమార వసియించు నా
హృదయాంతరంగమున…

[Verse]
4. ప్రతిచోట నీ సాక్షిగ
ప్రభువా నేనుండునట్లు
ప్రతిచోట నీ సాక్షిగ
ప్రభువా నేనుండునట్లు

[Verse]
ఆత్మాభిషేకము నిమ్ము
ఆత్మీయ రూపుండా
ఆత్మాభిషేకము నిమ్ము
ఆత్మీయ రూపుండా

[Verse]
ప్రియయేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం
ముదమార వసియించు నా
హృదయాంతరంగమున…..

Leave a Reply