Paradeshulamo Priuyulara

పరదేశులమో ప్రియులారా
మన పురమిది
గాదెపుడు నిజముగ

1. చిత్ర వస్తువులు చెల్లెడి యొక
విచిత్రమైన సంత లోకము

పరదేశులమో ప్రియులారా
మన పురమిది
గాదెపుడు నిజముగ

2. సంత గొల్లు క్షమ నడలిన చందం
బంతయు సద్దణగున్‌ నిజముగ

పరదేశులమో ప్రియులారా
మన పురమిది
గాదెపుడు నిజముగ

3. స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని
బరలోకమె స్థిరము నిజముగ

పరదేశులమో ప్రియులారా
మన పురమిది
గాదెపుడు నిజముగ

4. మేడలు మిద్దెలు మేలగు సరకులు
పాడై కనబడవే నిజముగ

పరదేశులమో ప్రియులారా
మన పురమిది
గాదెపుడు నిజముగ

5. ధన ధాన్యంబులు దరగక మానవు
పనిపాటలు పోయె నిజముగ

పరదేశులమో ప్రియులారా
మన పురమిది
గాదెపుడు నిజముగ

6. ఎన్నిన్నాళ్లు మన మిలలో బ్రతికిన
మన్నై పోవునుగా దేహము

పరదేశులమో ప్రియులారా
మన పురమిది
గాదెపుడు నిజముగ

7. వచ్చితి మిచటికి వట్టి హస్తముల
దెచ్చిన దేదియు లేదుగదా

పరదేశులమో ప్రియులారా
మన పురమిది
గాదెపుడు నిజముగ

8. ఎట్లు వచ్చితిమి యీ లోకమునకు
అట్లు వెళ్లవలయున్‌ మింటికి

పరదేశులమో ప్రియులారా
మన పురమిది
గాదెపుడు నిజముగ

9. యేసునందు విశ్వాసంబుంచిన
వాసిగ నిను జేర్చున్‌ బరమున

పరదేశులమో ప్రియులారా
మన పురమిది
గాదెపుడు నిజముగ

10. యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవముగా నిజముగ

పరదేశులమో ప్రియులారా
మన పురమిది
గాదెపుడు నిజముగ

Leave a Reply