Pampumu Deva Panivaralanu
[Verse]
పంపుము దేవా పనివారలను
పంటను కోయుటకు
నేడు పంటను కోయుటకు
కొంత మందియే శ్రమపడుచుండగా
చింతయెలేని క్రైస్తవులెందరిన్
[Verse]
1. నాగలి మీద చేయిని వేసి
వెనుకకు చూడక సాగెడివారిని
భారము కలిగి సువార్త గింజలు
దున్నిన యెదలో చల్లెడివారిని
[Verse]
పంపుము దేవా పనివారలను
పంటను కోయుటకు
నేడు పంటను కోయుటకు
కొంత మందియే శ్రమపడుచుండగా
చింతయెలేని క్రైస్తవులెందరిన్
[Verse]
2. తెల్లబారిన పొలమును చూచి
తెల్లవారక ముందే లేచి
ఉల్లము దేవుని ఆత్మతో నిండగ
ఉల్లాసముతో కూర్చెడివారిని
[Verse]
పంపుము దేవా పనివారలను
పంటను కోయుటకు
నేడు పంటను కోయుటకు
కొంత మందియే శ్రమపడుచుండగా
చింతయెలేని క్రైస్తవులెందరిన్
[Verse]
3. పరమండలము సంతసమొందగ
ధరణిలో ఆత్మల సంపద పండగ
చిరజీవమును ఒసగెడు యేసుని
రక్షణ మార్గము చాటెడు వారిని
[Verse]
పంపుము దేవా పనివారలను
పంటను కోయుటకు
నేడు పంటను కోయుటకు
కొంత మందియే శ్రమపడుచుండగా
చింతయెలేని క్రైస్తవులెందరిన్
Leave a Reply