O Yesu Nee Prema Entho Maha (
ఓ యేసు నీ ప్రేమ
ఎంతో మహనీయము
ఆకాశతార పర్వతసముద్ర
ముల కన్న గొప్పది
1. ఆగమ్య ఆనందమే
హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు
ఓ యేసు నీ ప్రేమ
ఎంతో మహనీయము
ఆకాశతార పర్వతసముద్ర
ముల కన్న గొప్పది
2. సంకట సమయములో
సాగలేకున్నాను
దయచూపు నా మీద
అని నేను మొర్రపెట్టగా
వింటినంటివి నా మొర్రకు ముందె
తోడనుందునంటివీ
ఓ యేసు నీ ప్రేమ
ఎంతో మహనీయము
ఆకాశతార పర్వతసముద్ర
ముల కన్న గొప్పది
3. మరణాంధకారపు
లోయనే సంచరించిన
నిరంతరమేసు నాదు కాపరియై
కరములిచ్చి నన్ను నడుపు
కరుణగల ప్రభువు
ఓ యేసు నీ ప్రేమ
ఎంతో మహనీయము
ఆకాశతార పర్వతసముద్ర
ముల కన్న గొప్పది
4. కొదువలెన్నియున్న
భయపడ నేనిపుడు
పచ్చిక బయలులో పరుండజేయును
భోజన జలములతో తృప్తి పరచుచు
నాతో నుండు నేసు
ఓ యేసు నీ ప్రేమ
ఎంతో మహనీయము
ఆకాశతార పర్వతసముద్ర
ముల కన్న గొప్పది
5. దేవుని గృహములో
సదా స్తుతించెదను
సంపూర్ణ హృదయముతో
సదా భజించెదను
స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు
హల్లెలూయ ఆమేన్
ఓ యేసు నీ ప్రేమ
ఎంతో మహనీయము
ఆకాశతార పర్వతసముద్ర
ముల కన్న గొప్పది
Leave a Reply