O Yesu Nee Namamentha Ruchi

ఓ యేసు నీ నామమెంత రుచయ్యా
యేసయ్య నీనామమెంత రుచయ్యా
ఎంత రుచయ్యాబలే వింత రుచయ్యా

1. పాపులము మా కొరకు ప్రాణమిస్తివి
ప్రాణమిస్తివి మా బాధ దీస్తివి

2. దయ్యాలు నిన్ను జూచి తల్లడిల్లెను
తల్లడిల్లెను మమ్ము దాటి పోయెను

3. రోగుల నెందరినో బాగు చేస్తివి
బాగుచేస్తివి మమ్ము బాగు చేస్తివి

4. చచ్చిన కొందరికి జీవమిస్తివి
చచ్చిపోయి మూడో నాడు సరిగలేస్తివి

5. ఇన్నాళ్ళు బొమ్మ పూజలన్నిజేస్తిమి
అన్ని జేస్తిమి యిపుడు నిన్ను గంటిమి

Leave a Reply