Nuthijeyumu Prabhu Sanghama

[Verse]
నుతిజేయుము ప్రభు సంఘమా!
అతి వినయ హృదయముతో నేడేసు
క్షితి దాదన రక్తము చేగొనిన
క్రీస్తేసుని ఘన సంఘమా

[Verse]
క్షితి దాదన రక్తము చేగొనిన
క్రీస్తేసుని ఘన సంఘమా…

[Verse]
1. ప్రభు వాగ్ధాన శిలా పర్వతమా!
ప్రభు యేసుని వాగ్ధానములన్‌
ప్రభు వాగ్ధాన శిలా పర్వతమా!
ప్రభు యేసుని వాగ్ధానములన్‌

[Verse]
అభయంబుల లెక్కించుచును
ఆ పరిశుద్ధుని నీదినము
నుతిజేయుము ప్రభు సంఘమా!
అతి వినయ హృదయముతో నేడేసు

[Verse]
క్షితి దాదన రక్తము చేగొనిన
క్రీస్తేసుని ఘన సంఘమా
క్షితి దాదన రక్తము చేగొనిన
క్రీస్తేసుని ఘన సంఘమా…

[Verse]
2. బలియాయెను సిలువన్‌ నీ కొఱకై
వెల లేని రక్తం బొలకించెన్‌
బలియాయెను సిలువన్‌ నీ కొఱకై
వెల లేని రక్తం బొలకించెన్‌

[Verse]
యిల నీ ఋణముల దీర్చునయా
బలిపశువు నీ దినము
నుతిజేయుము ప్రభు సంఘమా!
అతి వినయ హృదయముతో నేడేసు

[Verse]
క్షితి దాదన రక్తము చేగొనిన
క్రీస్తేసుని ఘన సంఘమా
క్షితి దాదన రక్తము చేగొనిన
క్రీస్తేసుని ఘన సంఘమా…

[Verse]
3. మలినాభరణములన్‌ దొలగించి
మహిమా వస్త్రంబున్‌ దొడగించి
మలినాభరణములన్‌ దొలగించి
మహిమా వస్త్రంబున్‌ దొడగించి

[Verse]
మరి పెండ్లి కుమార్తెనుగను నిన్‌
మార్చిన యాతని నీ దినము
నుతిజేయుము ప్రభు సంఘమా!
అతి వినయ హృదయముతో నేడేసు

[Verse]
క్షితి దాదన రక్తము చేగొనిన
క్రీస్తేసుని ఘన సంఘమా
క్షితి దాదన రక్తము చేగొనిన
క్రీస్తేసుని ఘన సంఘమా…

[Verse]
4. శ్రమ లోకము నుండి రక్షించి
విమలాశ్రమమునకు దాటించి
శ్రమ లోకము నుండి రక్షించి
విమలాశ్రమమునకు దాటించి

[Verse]
వరియించుట కరుదెంచు ప్రభు
బరిశుద్ధుని నీదినము
నుతిజేయుము ప్రభు సంఘమా!
అతి వినయ హృదయముతో నేడేసు

[Verse]
క్షితి దాదన రక్తము చేగొనిన
క్రీస్తేసుని ఘన సంఘమా
క్షితి దాదన రక్తము చేగొనిన
క్రీస్తేసుని ఘన సంఘమా…..

Leave a Reply