Nuthanamainadi Nee Vatsalyamu

[Verse]
నూతనమైనది నీ వాత్సల్యము
ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను

[Verse]
తరములు మారుచున్నను
దినములు గడుచుచున్నను
నీ ప్రేమలో మార్పులేదు

తరములు మారుచున్నను
దినములు గడుచుచున్నను
నీ ప్రేమలో మార్పులేదు

[Verse]
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామము
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామము…

[Verse]
1. గడచిన కాలమంత
నీ కృపచూపి ఆదరించినావు
జరగబోయే కాలమంత
నీ కృపలోన నన్ను దాచెదవు

గడచిన కాలమంత
నీ కృపచూపి ఆదరించినావు
జరగబోయే కాలమంత
నీ కృపలోన నన్ను దాచెదవు

[Verse]
విడువని దేవుడవు
యెడబాయలేదు నన్ను
క్షణమైనా త్రోసివేయవు

విడువని దేవుడవు
యెడబాయలేదు నన్ను
క్షణమైనా త్రోసివేయవు

[Verse]
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామమును
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామమును…

[Verse]
2. నా హీనదశలో
నీ ప్రేమ చూపి పైకి లేపినావు
ఉన్నత స్థలములో
నను నిలువబెట్టి ధైర్యపరచినావు

నా హీనదశలో
నీ ప్రేమ చూపి పైకి లేపినావు
ఉన్నత స్థలములో
నను నిలువబెట్టి ధైర్యపరచినావు

[Verse]
మరువని దేవుడవు
నను మరువలేదు నీవు
ఏ సమయమైనను
చేయి విడువవు

మరువని దేవుడవు
నను మరువలేదు నీవు
ఏ సమయమైనను
చేయి విడువవు

[Verse]
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామమును
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామమును…

[Verse]
3. నీ రెక్కలక్రింద
నను దాచినావు ఆశ్రయమైనావు
నా దాగు స్థలముగ
నీవుండినావు సంరక్షించావు

నీ రెక్కలక్రింద
నను దాచినావు ఆశ్రయమైనావు
నా దాగు స్థలముగ
నీవుండినావు సంరక్షించావు

[Verse]
ప్రేమించే దేవుడవు
తృప్తిపరచినావు నన్ను
సమయోచితముగా
ఆదరించినావు

ప్రేమించే దేవుడవు
తృప్తిపరచినావు నన్ను
సమయోచితముగా
ఆదరించినావు

[Verse]
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామము
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామము

[Verse]
నూతనమైనది నీ వాత్సల్యము
ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను

[Verse]
తరములు మారుచున్నను
దినములు గడుచుచున్నను
నీ ప్రేమలో మార్పులేదు

తరములు మారుచున్నను
దినములు గడుచుచున్నను
నీ ప్రేమలో మార్పులేదు

[Verse]
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామము
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామము

[Verse]
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామము
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామము…

Leave a Reply