Neethigala Yehova Stuthi
[Verse]
నీతిగల యెహోవా స్తుతి
మీ యాత్మతో నర్పించుడి
మీ యాత్మతో సేవించుడి
[Verse]
నీతిగల యెహోవా స్తుతి
మీ యాత్మతో నర్పించుడి
మీ యాత్మతో సేవించుడి
[Verse]
దాతయౌ మన క్రీస్తు నీతిని
దాల్చుకొని సేవించుడి
[Verse]
నీతిగల యెహోవా స్తుతి
మీ యాత్మతో నర్పించుడి
మీ యాత్మతో సేవించుడి…
[Verse]
1. చదల బుడమియు
రవియు జలధియు
నదులు గిరులును జక్కగా
సదమలంబగు దైవనామము
సర్వదా నుతిజేయను
[Verse]
నీతిగల యెహోవా స్తుతి
మీ యాత్మతో నర్పించుడి
మీ యాత్మతో సేవించుడి…
[Verse]
2. సర్వశక్తుని కార్యముల కీ
సర్వరాష్ట్రములన్నియు
గర్వములు విడి తలలు వంచుచు
నుర్విలో నుతిజేయను
[Verse]
నీతిగల యెహోవా స్తుతి
మీ యాత్మతో నర్పించుడి
మీ యాత్మతో సేవించుడి…
[Verse]
3. గీత తాండవ వాద్యములచే
బ్రీతిపరచెడు సేవతో
పాతకంబులు పరిహరించెడు
దాతనే సేవించుడి
[Verse]
నీతిగల యెహోవా స్తుతి
మీ యాత్మతో నర్పించుడి
మీ యాత్మతో సేవించుడి…
[Verse]
4. పరమ దూతలు నరులు పుడమిని
మొరలు బెట్టుచు దేవుని
పరము నందున్నట్టి యేసుని
పాదములు సేవింతురు
[Verse]
నీతిగల యెహోవా స్తుతి
మీ యాత్మతో నర్పించుడి
మీ యాత్మతో సేవించుడి…
[Verse]
5. ఇలను భక్తులు గూడుకొని
యా బలము గల్గిన దేవుని
వెలయు స్తుతి వేనోళ్లతోడను
విసుగు జెందక జేయుడి
[Verse]
నీతిగల యెహోవా స్తుతి
మీ యాత్మతో నర్పించుడి
మీ యాత్మతో సేవించుడి…
[Verse]
6. ఆత్మ నీవిక మేలుకొని
శుద్ధాత్మయేసుని దండ్రిని
త్రిత్వమగు నా యేక దేవుని
హర్షమున సేవింపవే
[Verse]
నీతిగల యెహోవా స్తుతి
మీ యాత్మతో నర్పించుడి
మీ యాత్మతో సేవించుడి…..

Leave a Reply