Nee Swaramu Vinipinchu
నీ స్వరము వినుపించు ప్రభువా
నీ దాసుడాలకించున్
నీ వాక్యమును నేర్పించున్
దానియందు నడచునట్లు నీతో
1. ఉదయమున లేచి నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు
రక్షించు ఆపదలనుండి
నీ స్వరము వినుపించు ప్రభువా
నీ దాసుడాలకించున్
నీ వాక్యమును నేర్పించున్
దానియందు నడచునట్లు నీతో
2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు
నేను సరిచేసుకొందు
నీ మార్గములో నడుచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడు
నీ స్వరము వినుపించు ప్రభువా
నీ దాసుడాలకించున్
నీ వాక్యమును నేర్పించున్
దానియందు నడచునట్లు నీతో
3. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నాకొరకే
నాతో మనుష్యులతో సరిచేసుకొందు
నీ దివ్య వాక్యము ద్వారా
నీ స్వరము వినుపించు ప్రభువా
నీ దాసుడాలకించున్
నీ వాక్యమును నేర్పించున్
దానియందు నడచునట్లు నీతో

Leave a Reply