Nadipinchu Na Nava
[Verse]
నడిపించు నా నావ
నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున
నా జన్మ తరియింప
నడిపించు నా నావ…
[Verse]
1. నా జీవిత తీరమున
నా యపజయ భారమున
నలిగిన నా హృదయమును
నడిపించుము లోతునకు
[Verse]
నా యాత్మ విరబూయ
నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము
నా సేవ జేకొనుము
నడిపించు నా నావ…
[Verse]
2. రాత్రంతయు శ్రమపడినా
రాలేదు ప్రభూ జయమూ
రహదారులు వెదకిననూ
రాదాయెను ప్రతిఫలము
[Verse]
రక్షించు నీ సిలువ
రమణీయ లోతులలో
రతనాలను వెదుకుటలో
రాజిల్లు నా పడవ
నడిపించు నా నావ…
[Verse]
3. ఆత్మార్పణ జేయకయే
ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే
అరసితి ప్రభు నీ కలిమి
[Verse]
ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమి గని
అల్లాడె నావలలు
నడిపించు నా నావ…
[Verse]
4. ప్రభు మార్గము విడిచితిని
ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని
పరమార్థము మరచితిని
[Verse]
ప్రపంచ నటనలలో
ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు
పాటింతు నీ మాట
నడిపించు నా నావ…
[Verse]
5. లోతైన జలములలో
లోతున వినబడు స్వరమా
లోబడుటకు నేర్పించి
లోపంబులు సవరించి
[Verse]
లోనున్న యీవులలో
లోతైన నా బ్రతుకు
లోపించని యర్పణగా
లోకేశ జేయుమయ
నడిపించు నా నావ…
[Verse]
6. ప్రభుయేసుని శిష్యుడనై
ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో
పరిశుద్ధుని ప్రేమకథ
[Verse]
పరమాత్మ ప్రోక్షణతో
పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభుకొరకు
పాణార్పనముజేతు
[Verse]
నడిపించు నా నావ
నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున
నా జన్మ తరియింప
నడిపించు నా నావ…..
Leave a Reply