Na Yesunadha Neeve
నా యేసునాధ నీవే నా ప్రాణదాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా యేసునాధ నీవే నా ప్రాణదాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా జీవితాంతము నిన్నే స్తుతింతును
నే బ్రతుకు దినములు నిన్నే స్మరింతును
ఏ రీతి పాడను నీ ప్రేమ గీతము
ఏనాడు వీడని నీ స్నేహ బంధము
నా యేసునాధ నీవే నా ప్రాణదాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా దాగుచోటు నీవే యేసయ్యా…
1. ప్రభు యేసు దైవమా
చిరకాల స్నేహమా
నీలో నిరీక్షణే బలమైనది
ప్రియమార నీ స్వరం
వినిపించు ఈ క్షణం
నీ జీవవాక్యమే వెలుగైనది
నీ సన్నిధానమే సంతోష గానమై
నీ నామ ధ్యానమే సీయోను మార్గమై
భయపడను నేనిక నీ ప్రేమ సాక్షిగా
గానమై రాగమై
అనుదినము నిన్నే ఆరాధింతును
కలకాలం నీలో ఆనందింతును
అనుదినము నిన్నే ఆరాధింతును
కలకాలం నీలో ఆనందింతును
నా యేసునాధ నీవే నా ప్రాణదాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా దాగుచోటు నీవే యేసయ్యా…
2. కొనియాడి పాడనా మనసార వేడనా
నీ ప్రేమ మాటలే విలువైనవి
ఎనలేని బాటలో వెనువెంట తోడుగా
నా యందు నీ కృప ఘనమైనది
నా నీతి సూర్యుడా నీ ప్రేమ శాశ్వతం
నా జీవ యాత్రలో నీవేగ ఆశ్రయం
నీ పాద సేవయే నాలోని ఆశగా
ప్రాణమా జీవమా
అనుదినము నిన్నే ఆరాధింతును
కలకాలం నీలో ఆనందింతును
అనుదినము నిన్నే ఆరాధింతును
కలకాలం నీలో ఆనందింతును
నా యేసునాధ నీవే నా ప్రాణదాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా యేసునాధ నీవే నా ప్రాణదాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా జీవితాంతము నిన్నే స్తుతింతును
నే బ్రతుకు దినములు నిన్నే స్మరింతును
ఏ రీతి పాడను నీ ప్రేమ గీతము
ఏనాడు వీడని నీ స్నేహ బంధము
నా యేసునాధ నీవే నా ప్రాణదాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా దాగుచోటు నీవే యేసయ్యా
నా దాగుచోటు నీవే యేసయ్యా…..
Leave a Reply