Datrutvamunu Galigi Perugudama
దాతృత్వమును గలిగి పెరుగుదమ
ధనము ధాత్రి దేవునిదంచు నెఱుగుదమ
1. శక్తి కొలది కాన్కలర్పింతమ
మన భుక్తినుండి కొంత దీయుదమ
దాతృత్వమును గలిగి పెరుగుదమ
ధనము ధాత్రి దేవునిదంచు నెఱుగుదమ
2. సంతోషముగ నియ్యసాగుదమ
మన స్వంతటితో జేయ నేగుదమ
దాతృత్వమును గలిగి పెరుగుదమ
ధనము ధాత్రి దేవునిదంచు నెఱుగుదమ
3. గర్వఘనములు వీడి యర్పింతమ
యుర్వి సర్వ మాయనదంచు నేర్పింతమ
దాతృత్వమును గలిగి పెరుగుదమ
ధనము ధాత్రి దేవునిదంచు నెఱుగుదమ
4. సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ
క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ
దాతృత్వమును గలిగి పెరుగుదమ
ధనము ధాత్రి దేవునిదంచు నెఱుగుదమ
5. ప్రతి యాదివార మిది మది నుంతమ
దీని ప్రతి సంఘస్థుడు చేయ బోధింతమ
దాతృత్వమును గలిగి పెరుగుదమ
ధనము ధాత్రి దేవునిదంచు నెఱుగుదమ
6. విధి దలచి దుర్బలుల రక్షింతమ
సంఘ విధవాళి దానముతో దర్శింతమ
దాతృత్వమును గలిగి పెరుగుదమ
ధనము ధాత్రి దేవునిదంచు నెఱుగుదమ
7. దిక్కులేని జనుల దీవింతమ
వారి యక్కఱలలో మేలు గావింతమ
దాతృత్వమును గలిగి పెరుగుదమ
ధనము ధాత్రి దేవునిదంచు నెఱుగుదమ
8. పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ
మఱల నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ
దాతృత్వమును గలిగి పెరుగుదమ
ధనము ధాత్రి దేవునిదంచు నెఱుగుదమ
9. వెదజల్లి యభివృద్ధి పొందుదమ
మోక్ష పదవు లనుభవింప బరుగిడుదమ
దాతృత్వమును గలిగి పెరుగుదమ
ధనము ధాత్రి దేవునిదంచు నెఱుగుదమ
10. వర్ధిల్లిన కొలది చెల్లింతమ
లోక వ్యర్థ ఖర్చులనెల్ల మళ్ళింతమ
దాతృత్వమును గలిగి పెరుగుదమ
ధనము ధాత్రి దేవునిదంచు నెఱుగుదమ…

Leave a Reply