Chintha Ledika Yesu
[Verse]
చింత లేదిక యేసు పుట్టెను
వింతగను బెత్లెహేమందున
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతస మొందుమా
[Verse]
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతస మొందుమా…
1. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త
నా దివసంబు వింతగ
[Verse]
ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి
స్తుతులొనరించిరి
ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి
స్తుతులొనరించిరి
[Verse]
చింత లేదిక యేసు పుట్టెను
వింతగను బెత్లెహేమందున
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతస మొందుమా
[Verse]
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతస మొందుమా…
2. చుక్కగనుగొని జ్ఞానులెంతో
మక్కువతో నా ప్రభుని గనుగొన
[Verse]
చక్కగా బెత్లేము పురమున జొచ్చిరి
కానుక లిచ్చిరి
చక్కగా బెత్లేము పురమున జొచ్చిరి
కానుక లిచ్చిరి
[Verse]
చింత లేదిక యేసు పుట్టెను
వింతగను బెత్లెహేమందున
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతస మొందుమా
[Verse]
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతస మొందుమా…
3. కన్య గర్భమునందు బుట్టెను
కరుణగల రక్షకుడు క్రీస్తుడు
[Verse]
ధన్యులగుటకు రండి వేగమే దీనులై
సర్వ మాన్యులై
ధన్యులగుటకు రండి వేగమే దీనులై
సర్వ మాన్యులై
[Verse]
చింత లేదిక యేసు పుట్టెను
వింతగను బెత్లెహేమందున
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతస మొందుమా
[Verse]
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతస మొందుమా…
4. పాప మెల్లను పరిహరింపను
పరమ రక్షకుడవతరించెను
[Verse]
దాపు జేరిన వారికిడు గడు భాగ్యము
మోక్ష భాగ్యము
దాపు జేరిన వారికిడు గడు భాగ్యము
మోక్ష భాగ్యము
[Verse]
చింత లేదిక యేసు పుట్టెను
వింతగను బెత్లెహేమందున
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతస మొందుమా
[Verse]
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతస మొందుమా…..

Leave a Reply