Bhedam Emi Ledu
భేదం ఏమి లేదు అందరును పాపము
చేసియున్నారు
దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను
పోగొట్టుకున్నారు
భేదం ఏమి లేదు అందరును పాపము
చేసియున్నారు
దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను
పోగొట్టుకున్నారు
ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
దేవుని దృష్టిలో అందరు పాపులే
ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
దేవుని దృష్టిలో అందరు పాపులే
భేదం ఏమి లేదు అందరును పాపము
చేసియున్నారు
దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను
పోగొట్టుకున్నారు…
1. ఆస్తిపాస్తులు ఎన్నున్నా
నిత్య రాజ్యము నీకివ్వవు
విద్యార్హతలు ఎన్నున్నా
సంతోషాన్ని నీకివ్వవు
ఆస్తిపాస్తులు ఎన్నున్నా
నిత్య రాజ్యము నీకివ్వవు
విద్యార్హతలు ఎన్నున్నా
సంతోషాన్ని నీకివ్వవు
సమసిపోయే ఈ లోకము
ఆశ్రయాన్ని నీకివ్వదు
కరిగిపోయే ఈ కాలము
కలవరాన్ని తీర్చదు
నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా
నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా
భేదం ఏమి లేదు అందరును పాపము
చేసియున్నారు
దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను
పోగొట్టుకున్నారు…
2. పుణ్య కార్యాలు చేసినా
పవిత్రత నీకు రాదుగా
తీర్థ యాత్రలు తిరిగినా
తరగదు నీ పాపము..
పుణ్య కార్యాలు చేసినా
పవిత్రత నీకు రాదుగా
తీర్థ యాత్రలు తిరిగినా
తరగదు నీ పాపము
పరమును వీడిన పరిశుద్ధుడేసు
రక్తము కార్చెను కలువరిలో
కోరి కోరి నిను పిలిచెను
పరమ రాజ్యము నీకివ్వగా
నీ స్థితి ఏదైనా గతి ఏదైనా
వృత్తేదైనా భృతి ఏదైనా
కలువరి నాథుడే రక్షణ మార్గము
నీ స్థితి ఏదైనా గతి ఏదైనా
వృత్తేదైనా భృతి ఏదైనా
కలువరి నాథుడే రక్షణ మార్గము
భేదం ఏమి లేదు అందరును పాపము
చేసియున్నారు
దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను
పోగొట్టుకున్నారు
భేదం ఏమి లేదు అందరును పాపము
చేసియున్నారు
దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను
పోగొట్టుకున్నారు
ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
దేవుని దృష్టిలో అందరు పాపులే
ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
దేవుని దృష్టిలో అందరు పాపులే
భేదం ఏమి లేదు అందరును పాపము
చేసియున్నారు
దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను
పోగొట్టుకున్నారు…..
Leave a Reply