Bhasillenu Siluvalo
[Verse]
భాసిల్లెను సిలువలో పాపక్షమ
యేసు ప్రభు నీ దివ్య క్షమ
భాసిల్లెను సిలువలో పాపక్షమ…
[Verse]
1. కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతిజేసె
కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతిజేసె
[Verse]
కలుషహరా
కరుణించితివి
కలుషహరా
కరుణించితివి
భాసిల్లెను సిలువలో పాపక్షమ
యేసు ప్రభు నీ దివ్య క్షమ
భాసిల్లెను సిలువలో పాపక్షమ…
[Verse]
2. దోషము చేసినది నేనే గదా
మోసముతో బ్రతికిన నేనే గదా
దోషము చేసినది నేనే గదా
మోసముతో బ్రతికిన నేనే గదా
[Verse]
మోసితివా
నా శాపభారం
మోసితివా
నా శాపభారం
భాసిల్లెను సిలువలో పాపక్షమ
యేసు ప్రభు నీ దివ్య క్షమ
భాసిల్లెను సిలువలో పాపక్షమ…
[Verse]
3. పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నే నార్జించినది
పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నే నార్జించినది
[Verse]
కాపరివై
నను బ్రోచితివి
కాపరివై
నను బ్రోచితివి
[Verse]
భాసిల్లెను సిలువలో పాపక్షమ
యేసు ప్రభు నీ దివ్య క్షమ
భాసిల్లెను సిలువలో పాపక్షమ…
[Verse]
4. ఎందులకో నాపై యీ ప్రేమ
అందదయా స్వామి నా మదికి
ఎందులకో నాపై యీ ప్రేమ
అందదయా స్వామి నా మదికి
[Verse]
అందులకే
భయమొందితిని
అందులకే
భయమొందితిని
[Verse]
భాసిల్లెను సిలువలో పాపక్షమ
యేసు ప్రభు నీ దివ్య క్షమ
భాసిల్లెను సిలువలో పాపక్షమ…
[Verse]
5. నీ మరణపు వేదన వృధగాదు
నా మది నీ వేదనలో మునిగె
నీ మరణపు వేదన వృధగాదు
నా మది నీ వేదనలో మునిగె
[Verse]
క్షేమము కలిగెను
హృదయములో
క్షేమము కలిగెను
హృదయములో
[Verse]
భాసిల్లెను సిలువలో పాపక్షమ
యేసు ప్రభు నీ దివ్య క్షమ
భాసిల్లెను సిలువలో పాపక్షమ…
[Verse]
6. నమ్మిన వారిని కాదనవనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మిన వారిని కాదనవనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
[Verse]
నమ్మితి
నీ పాదమ్ములను
నమ్మితి
నీ పాదమ్ములను
[Verse]
భాసిల్లెను సిలువలో పాపక్షమ
యేసు ప్రభు నీ దివ్య క్షమ
భాసిల్లెను సిలువలో పాపక్షమ…..
Leave a Reply