Anni Kalambula Nunna
[Verse]
అన్ని కాలంబుల నున్న యెహోవా
నిన్నెన్న దరంబ యో కన్నతండ్రి
అన్ని కాలంబుల నున్న యెహోవా
నిన్నెన్న దరంబ యో కన్నతండ్రి
[Verse]
వన్నెకెక్కిన మోక్ష
వాసాళి సన్నుతుల్
వన్నెకెక్కిన మోక్ష
వాసాళి సన్నుతుల్
ఉన్నతమైయుండ మున్నె నీకు
అన్ని కాలంబుల నున్న యెహోవా
నిన్నెన్న దరంబ యో కన్నతండ్రి…
[Verse]
1. నిన్ను బ్రకటనసేయ
నిఖిల లోకములను
పన్నుగ జేసిన బలుడ వీవే
ఉన్న లోకంబుల నుడుగక కరుణా సం
ఉన్న లోకంబుల నుడుగక కరుణా
సంపన్నతతో నేలు ప్రభుడ వీవే
[Verse]
అన్ని జీవుల నెఱిగి
యాహార మిచ్చుచు
నున్న సర్వజ్ఞుండవు నీవే
ఎన్నశక్యముగాక ఉన్న లక్షణముల
ఎన్నశక్యముగాక ఉన్న లక్షణముల
సన్నుతించుటకు నే జాలుదునా
[Verse]
అన్ని కాలంబుల నున్న యెహోవా
నిన్నెన్న దరంబ యో కన్నతండ్రి…
[Verse]
2. పుట్టింప నీవంచు
బోషింప నీవంచు
గిట్టింప నీవంచు గీర్తింతును
వట్టి పనికి మాలి నట్టి మానవులచే
వట్టి పనికి మాలి నట్టి మానవుల
చేపట్టి రక్షింప బాధ్యుండ వంచు
[Verse]
దట్టమైన కృపను
దరిజేర్చ నాకిచ్చి
పట్టయి నిలచియుండు
ప్రభుడ వంచు
గట్టడచే గడముట్టు దనుక నా
గట్టడచే గడముట్టు దనుక నా
పట్టుకొలది నిన్ను బ్రస్తుతింతు
[Verse]
అన్ని కాలంబుల నున్న యెహోవా
నిన్నెన్న దరంబ యో కన్నతండ్రి…
[Verse]
3. కారుణ్య నిధి నీవు
కఠినాత్ముడను నేను
భూరిశుద్ధుడ వీవు
పాపి నేను
సార భాగ్యుడ వీవు జగతిలో నాకన్న
సార భాగ్యుడ వీవు జగతిలో నాకన్న
దారిద్రుడే లేడు
తరచి చూడ
[Verse]
సార సద్గుణముల
సంపన్నుడవు నీవు
ఘోరదుర్గుణ
సంచారి నేను
ఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతు
ఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతు
నేర మెన్నక ప్రోవ
నెర నమ్మితి
[Verse]
అన్ని కాలంబుల నున్న యెహోవా
నిన్నెన్న దరంబ యో కన్నతండ్రి…..

Leave a Reply