సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు
నీవే నా బలం..నీవే నా నమ్మకం..
గడచినా కాలము నాతో ఉన్నావు
నేడు నాతోడు నడచుచున్నావు
సదా నాతోనే ఉంటావు..
ఎగసిపడే తుఫానుల్లో నీవే
ఆశ్రయ దుర్గము ఎదురుపడి అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే..
వ్యాధి నను చుట్టిన..లెమ్మని సెలవిచ్చెదవు
యెహోవా రఫా..నీవే నా స్వస్థత..
ఓ వ్యాధి నీ శిరస్సు వంగేనే
నాపై నీ అధికారం చెల్లదే
రూపింపబడిన ఏ ఆయుధం
నాకు విరోధముగా వర్ధిల్లదు

Leave a Reply