సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణ మరుణోదయం
సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణ మరుణోదయం
తెర మరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది
తెర మరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది
సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణ మరుణోదయం
సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణ మరుణోదయం…
1. దివి రాజుగా భువికి దిగినాడని
రవి రాజుగా ఇలను మిగిలాడని
దివి రాజుగా భువికి దిగినాడని
రవి రాజుగా ఇలను మిగిలాడని
నవలోక గగనాలు పిలిచాడని
పరలోక భవనాలు తెరిచాడని
నవలోక గగనాలు పిలిచాడని
పరలోక భవనాలు తెరిచాడని
ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది
పాడి పంటల పశువులశాలను ఊయల చేసింది
ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది
పాడి పంటల పశువులశాలను ఊయల చేసింది
నిను కావగా – నిరుపేదగా
జన్మించగా – ఇల పండుగ
నిను కావగా – నిరుపేదగా
జన్మించగా – ఇల పండుగ
సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణ మరుణోదయం
సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణ మరుణోదయం
2. లోకాలలో పాప శోకాలలో
ఏకాకిలా బ్రతుకు అవివేకులు
లోకాలలో పాప శోకాలలో
ఏకాకిలా బ్రతుకు అవివేకులు
క్షమ హృదయ సహనాలు సమపాళ్ళుగా
ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా
క్షమ హృదయ సహనాలు సమపాళ్ళుగా
ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే
నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే
నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే
ఆ జన్మమే – ఒక మర్మము
ఆ బంధమే – అనుబంధము
ఆ జన్మమే – ఒక మర్మము
ఆ బంధమే – అనుబంధము
సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణ మరుణోదయం
సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణ మరుణోదయం
తెర మరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది
తెర మరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది
సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణ మరుణోదయం
సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణ మరుణోదయం…..

Leave a Reply